Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి గురించి ముస్లింలను రెచ్చగొడుతున్నారు : మోదీ
ABN , First Publish Date - 2023-06-27T16:09:57+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని బూచిగా చూపుతూ ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? అని ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుందని ప్రశ్నించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు.
భోపాల్ : ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని బూచిగా చూపుతూ ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? అని ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుందని ప్రశ్నించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు.
మోదీ మంగళవారం ఐదు సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్లను భోపాల్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ, బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.
యూసీసీని బూచిగా చూపిస్తూ, ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారన్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? అని ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుందని ప్రశ్నించారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన ముస్లింల హక్కులను తిరస్కరిస్తున్నారని, వారిని పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు. ట్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా మాట్లాడేవారు ముస్లిం ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నారని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విధానం ఇస్లాంలో అతి ముఖ్యమైన భాగం అయి ఉంటే, దానిని కతార్, జోర్డాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఎందుకు నిషేధించారో చెప్పాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు యూసీసీని సాకుగా చూపించి, రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయనే విషయాన్ని ముస్లింలు గ్రహించాలని పిలుపునిచ్చారు.
ముస్లింలు గంపగుత్తగా బీజేపీకి వ్యతిరేకంగా ఏకీకృతం కాకుండా నిరోధించడం కోసం బీజేపీ పాస్మాండ, బోహ్రా ముస్లింలకు చేరువవుతున్న సంగతి తెలిసిందే. మైనారిటీ వ్యతిరేకి అనే ముద్రను మార్చడం కోసం ఈ వర్గాలవారిని కలవాలని గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మోదీ బీజేపీ కార్యకర్తలను కోరారు.
యూసీసీని తాజాగా పరిశీలించే ప్రక్రియను లా కమిషన్ ఆఫ్ ఇండియా గత నెలలో ప్రారంభించింది. దీనిపై అభిప్రాయాలను తెలపాలని ప్రజలను, మత సంస్థలను కోరింది. వివాహం, విడాకులు, పిల్లల దత్తత, వారసత్వ హక్కులు వంటివాటికి వేర్వేరు మతస్థులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. ఈ అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టాన్ని తీసుకురావడమే లక్ష్యమని బీజేపీ గతంలోనే ప్రకటించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం, జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370 రద్దు కూడా ఆ పార్టీ ఆశయాలు. రామాలయం నిర్మాణం కొనసాగుతుండగా, అధికరణ 370 రద్దు జరిగిపోయింది.
ఇవి కూడా చదవండి :
Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?
Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు