Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2023-06-29T10:16:02+05:30 IST
ఈద్ అల్-అదా (Eid al-Adha) పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. అమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ నవఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ మిషల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవఫ్ అల్-అహ్మద్ అల్-సబహ్‌లతోపాటు కువైట్ ప్రజలకు భారతీయులతోపాటు తన తరపున శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ : ఈద్ అల్-అదా (Eid al-Adha) పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. అమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ నవఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ మిషల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవఫ్ అల్-అహ్మద్ అల్-సబహ్‌లతోపాటు కువైట్ ప్రజలకు భారతీయులతోపాటు తన తరపున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కువైట్ నేతలకు మోదీ వ్యక్తిగతంగా రాసిన లేఖలో, పవిత్రమైన ఈద్ అల్-అదా పండుగను భారత దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ లక్షలాది మంది ముస్లింలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది గుర్తు చేస్తుందన్నారు. శాంతియుత, సమ్మిళిత ప్రపంచం కావాలని మనమంతా కోరుకుంటామని, అటువంటి ప్రపంచ నిర్మాణంలో త్యాగం, కరుణ, సోదరభావం చాలా ముఖ్యమైనవని తెలిపారు.
మోదీ బుధవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ప్రజలను ఈ పండుగ మరింత చేరువ చేస్తుందని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి :
Bangalore: బెంగళూరులో 65 కిలోమీటర్ల సొరంగ మార్గం
Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా