BJP : బీజేపీ కీలక నేతలతో మోదీ అర్ధరాత్రి మంతనాలు.. లోక్‌సభ ఎన్నికలు, సంస్థాగత సమస్యలపై చర్చలు..
ABN , First Publish Date - 2023-06-29T12:18:01+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీని సమరోత్సాహంతో సిద్ధం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఆ పార్టీ అగ్ర నేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో బుధవారం రాత్రి చర్చలు జరిపారు. కేంద్ర మంత్రివర్గంలోనూ, పార్టీ సంస్థాగత విభాగాల్లోనూ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ ఈ చర్చలు జరిగాయి.
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీని సమరోత్సాహంతో సిద్ధం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో బుధవారం రాత్రి చర్చలు జరిపారు. కేంద్ర మంత్రివర్గంలోనూ, పార్టీ సంస్థాగత విభాగాల్లోనూ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ ఈ చర్చలు జరిగాయి.
ఈ ఏడాది చివరిలో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ అన్ని ఎన్నికల్లో పార్టీ సర్వసన్నద్ధంగా, సమరోత్సాహంతో దూసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వంలోనూ, జాతీయ, రాష్ట్ర స్థాయుల్లోనూ మార్పులు జరగబోతున్నాయని కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. మోదీ అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని, తిరిగి వచ్చిన వెంటనే పార్టీ పట్ల దృష్టి సారించారు.
మోదీ మంగళవారం మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతి అవసరం చాలా ఉందని నొక్కి వక్కాణించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళిక (Manifesto)లో దీని గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా
Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు