Narendra modi: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభిస్తూ లాలూపై మోదీ చురకలు..!
ABN , First Publish Date - 2023-04-12T15:12:12+05:30 IST
రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో..
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో (Rajasthan) తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను (Vande Bharat Express) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా కేంద్ర మాజీ రైల్వే మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)పై చరకలు వేశారు. లాలూ హయాంలో చోటుచేసుకున్న ''ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్'' (Land for job Scam)ను మోదీ ప్రస్తావిస్తూ, ఒకప్పుడు ఇండియన్ రైల్వేల చుట్టూ రాజకీయాలు జరిగేవని, కొందరు వ్యక్తులు రైల్వే ఉద్యోగాలిస్తామంటూ పేదల భూములు లాక్కునేవారని విమర్శించారు.
రైల్వేల వంటి కీలక వ్యవస్థను, అందునా సామాన్య ప్రజానీకం నిత్యజీవితంలో భాగమైన రైల్వేలను రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడటం చాలా దగురదృష్టకరమని ప్రధాని అన్నారు. రైల్వే రిక్రూమ్‌మెంట్‌లో రాజకీయాలు చొప్పించిన పరిస్థితి ఉండేదని, పేద ప్రజల భూములు తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చేవారని చెప్పారు. 'ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్'పై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్‌పై మోదీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికీ లాలూ, ఆయన భార్య రబ్రీదేవిపై 2022లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. రైల్వే నియమ, నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ నియామకాలు జరిగాయని ఆ ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది.
కేంద్రలో యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఉద్యోగాలు ఆశించిన అభ్యర్థుల నుంచి భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఆ విధంగా కొన్ని ఆస్తులు లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులపై రిజిస్టర్ అయినట్టు సీబీఐ గుర్తించింది. 2023 మార్చి 25న లాలూ దంపతులతో పాటు ఈ కేసులో నిందితులందరికీ సమన్లు కూడా పంపింది.