Vande Bharat Express: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త
ABN , First Publish Date - 2023-02-09T08:52:33+05:30 IST
షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు శుక్రవారం నుంచి...
రేపు ప్రధాని మోదీ ప్రారంభం
ముంబయి: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.(Vande Bharat Express) ముంబయి- సాయినగర్ షిర్డీ, ముంబయి- షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి :United Airlines Flight: విమానంలో మంటలు...నలుగురికి అస్వస్థత
దేశంలోనే 9,10 రూట్లలో వందేభారత్ రైళ్లను శుక్రవారం మోదీ ప్రారంభించనున్నారు.(PM Modi to Flag Off) ముంబయి-నాసిక్ రోడ్-సాయినగర్ షిర్డీ, ముంబయి-పూనా-షోలాపూర్ మార్గాల్లో(Mumbai-Solapur, Shirdi route) వందేభారత్ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయలుదేరే వందేభారత్ రైలు దాదర్, థానే, నాసిక్ రోడ్డు స్టేషన్ల మీదుగా సాయినగర్ షిర్డీకి చేరుకోనుంది.
ఇది కూడా చదవండి : Money Laundering case: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు
ముంబయిలో ఉదయం 6.20 గంటలకు బయలుదేరే ఈ రైలు 11.40 గంటలకు షిర్డీకి చేరుకోనుంది. షోలాపూర్ వందేభారత్ రైలు ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయలు దేరి దాదర్, కల్యాణ్, పూణే, కుర్దువాడి మీదుగా షోలాపూర్ చేరుకోనుంది. కేవలం మూడు గంటల్లో షోలాపూర్ చేరుకోనుంది. 16 బోగీలతో సౌకర్యవంతంగా ఉన్న ఈ వందేభారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఈ రైలులో మల్టీమీడియా సిస్టం, ఎయిర్ కండిషనింగ్, బయో వ్యాక్యూమ్ టాయ్ లెట్ సౌకర్యాలు కల్పించారు.