Eid prayers : ముస్లిం సోదరులకు మోదీ ఈద్ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2023-04-22T10:56:21+05:30 IST
దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ (Eid-ul-Fitr) జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ (Eid-ul-Fitr) జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యాలు, కారుణ్యం మన సమాజంలో మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, సుఖ, సంతోషాలతో, సౌభాగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) కూడా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రేమ, కారుణ్యాలకు సంబంధించిన పండుగ అని తెలిపారు. ఇతరులకు సహాయపడాలనే సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. మనమంతా కలిసికట్టుగా సమాజంలో సోదరభావాన్ని వృద్ధి చేద్దామని శపథం చేద్దామని పిలుపునిచ్చారు.
మన దేశంలో అతి పెద్ద మసీదుల్లో ఒకటైన ఢిల్లీలోని జామా మసీదులో వందలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. నమాజు చేసిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. నెల రోజులపాటు ఉపవాస దీక్షల అనంతరం ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి :
మీ నిర్ణయం బాగుంది.. అండగా ఉంటా!
చెన్నైలో ఆ బైక్ సేవలు నిషేధించాలి