Rahul Gandhi: లద్దాఖ్‌లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అక్కడి ప్రజలు ఏమంటున్నారంటే...

ABN , First Publish Date - 2023-08-20T12:00:48+05:30 IST

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పునరుద్ఘాటించారు. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ ఈ మేరకు మరోసారి నరేంద్ర మోదీ సర్కారుపై (PM Modi) విరుచుకుపడ్డారు. ‘‘ ఈ ప్రాంతంలో జనాల భూమిని చైనా లాగేసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే చైనా మన భూమి లాక్కుంది. ఈ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్రవేశించి భూమి లాక్కుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

Rahul Gandhi: లద్దాఖ్‌లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అక్కడి ప్రజలు ఏమంటున్నారంటే...

లద్దాఖ్: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పునరుద్ఘాటించారు. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ ఈ మేరకు మరోసారి నరేంద్ర మోదీ సర్కారుపై (PM Modi) విరుచుకుపడ్డారు. ‘‘ ఈ ప్రాంతంలో జనాల భూమిని చైనా లాగేసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే చైనా మన భూమిని లాక్కుంది. ఈ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్రవేశించి భూమి ఆక్రమించిందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. కానీ ఒక్క అంగుళం కూడా పోలేదని ప్రధానమంత్రి చెప్పారు. అది సత్యం కాదు. ఈ విషయాన్ని ఇక్కడ ఎవరినైనా అడగొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

కాగా.. మూడేళ్లక్రితం 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సేనల మధ్య భయానక కొట్లాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాల సేనల్లో పెద్ద ఎత్తున మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇరు సేనల మధ్య సరిహద్దులో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే.


Untitled-6.jpg

తమకు కల్పించిన స్టేటస్ (కేంద్రపాలిత ప్రాంతం) పట్ల లద్దాఖ్ ప్రజలు ఏమంత సంతోషంగా లేరని అన్నారు. ‘‘ లద్దాఖ్ ప్రజల దగ్గర చాలా ఫిర్యాదులు ఉన్నాయి. వారికి కల్పించిన స్టేటస్ పట్ల వారు సంతృప్తికరంగా లేరు. ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది. ఉద్యోగుల వ్యవస్థ ఆధారంగా ప్రభుత్వాన్ని నడిపించకూడదు.. ప్రజలు కోరుకున్న విధంగా పాలన జరగాలి’’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా.. రాహుల్ గాంధీ లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. శనివారం బైక్‌పై పాంగాంగ్ లేక్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా లద్దాఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున నివాళులు అర్పించారు.

Updated Date - 2023-08-20T12:11:40+05:30 IST