Bajrang Dal Row : బజరంగ్ దళ్ పరువు నష్టం కేసు.. ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు..
ABN , First Publish Date - 2023-05-15T13:14:09+05:30 IST
బజరంగ్ దళ్ (Bajrand Dal)కు పరువు నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సోమవారం కాంగ్రెస్
న్యూఢిల్లీ : బజరంగ్ దళ్ (Bajrand Dal)కు పరువు నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge)కు సమన్లు జారీ చేసింది. హిందూ సురక్ష పరిషత్ బజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ చర్యలు తీసుకుంది. రూ.100 కోట్లు చెల్లించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ హనుమంతుడికి వ్యతిరేకమని, హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వదని చెప్పారు.
సంగ్రూర్‌కు చెందిన హితేష్ భరద్వాజ్ స్థానిక కోర్టులో ఖర్గేపై పరువు నష్టం దావా వేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఖర్గే బజరంగ్ దళ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థతో కాంగ్రెస్ పోల్చిందని, కర్ణాటకలో అధికారంలోకి వస్తే, బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన సివిల్ జడ్జి కోర్టు (సీనియర్ డివిజన్) రమణ్‌దీప్ కౌర్ సమన్లు జారీ చేశారు. జూలై 10న హాజరుకావాలని ఖర్గేను ఆదేశించారు.
మే 10న జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు మే 13న వెలువడ్డాయి. ప్రజలు బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో నిషేధానికి భయపడేది లేదని బజరంగ్ దళ్ నేతలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
India and America : అమెరికాతో భారత్ వ్యూహాత్మక చర్చలు వచ్చే నెలలో
Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!