Share News

RSS : వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి!

ABN , First Publish Date - 2023-10-24T12:05:32+05:30 IST

వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్‌ భగవత్‌ పాల్గొన్నారు..

RSS : వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి!

వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్‌ భగవత్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) విచ్చేశారు. గడ్కరీ, ఫడ్నవీస్ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ (RSS) సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ సభ్యులు నాగ్‌పూర్‌లో ‘పథ సంచాలన్’ నిర్వహించగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, సంఘ్ నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా.. మొదట ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్‌కు మోహన్ భగవత్ నివాళులర్పించారు.


Bhagavath-and-Shankar.jpg

విముక్తి.. విముక్తి!

అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. మనం వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి. ప్రపంచం నుంచి మన దేశానికి సరిపోయేవే తీసుకోవాలి. కాలానికి తగినట్లు దేశ ఉత్పత్తులు రూపొందించుకోవాలి. స్వదేశీ అభివృద్ధి మార్గాన్ని అవలంబించాల్సి ఉంది. సమాజ ఐక్యత మంత్రంతో అభివృద్ధికి సమాధానం దొరకాలి. ఐక్యత సాధించడం రాజ్యాంగంలో మార్గదర్శక సూత్రం అని మోహన్‌ భగవత్‌ చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమం అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడిన శంకర్ మహదేవన్.. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-10-24T12:05:40+05:30 IST