Share News

I.N.D.I.A. bloc: బీఎస్‌పీతో కాంగ్రెస్ మంతనాలు... నిలదీసిన ఎస్పీ..?

ABN , Publish Date - Dec 20 , 2023 | 09:14 PM

ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్‌ పార్టీని దూరంగా పెట్టాలని ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్‌ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తోంది.

I.N.D.I.A. bloc: బీఎస్‌పీతో కాంగ్రెస్ మంతనాలు... నిలదీసిన ఎస్పీ..?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్‌ పార్టీ (BSP)ని దూరంగా పెట్టాలని ఇండియా (I.N.D.I.A.) కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్‌ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తోం


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. అయితే కూటమిలో బీఎస్‌పీ ఉండకూడదని కాంగ్రెస్ నేతలకు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తెగేసి చెప్పారు. బీఎస్‌పీతో చర్చలు జరపాలనుకుంటున్నారా? వారితో టచ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని, యూపీలో సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎస్పీ నాయకులకు భరోసా ఇచ్చారు. కాగా, డిసెంబర్ చివరికల్లా సీట్ల షేరింగ్‌ చర్చలను ఫైనలేజ్ చేయాలని, 141 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా డిసెంబర్ 22న సమష్టిగా దేశవ్యాప్త నిరసనలు జరపాలని ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - Dec 20 , 2023 | 09:14 PM