Himanta Biswa on Sanathana Dharma: సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది

ABN , First Publish Date - 2023-09-18T19:31:10+05:30 IST

సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం(Sanathana Dharma) ఉంటుందని అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) అన్నారు. మధ్యప్రదేశ్(Madyapradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ(BJP) ఇవాళ జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించింది. ఆ యాత్రలో పాల్గొన్న హిమంత సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు.

Himanta Biswa on Sanathana Dharma: సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది

న్యూఢిల్లీ: సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం(Sanathana Dharma) ఉంటుందని అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) అన్నారు. మధ్యప్రదేశ్(Madyapradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ(BJP) ఇవాళ జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించింది. ఆ యాత్రలో పాల్గొన్న హిమంత సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.


సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న ఇండియా కూటమి నేతలను తరిమి కొట్టాలని అన్నారు. హిందువుల సహనాన్ని కాంగ్రెస్ తో కూడిన ఇండియా(INDIA Alliance) కూటమి భావ ప్రకటన స్వేచ్ఛగా భావించి మితిమీరుతోందని విమర్శించారు. ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడితే ఆ కూటమి నేతలు మాట్లాడతారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా వారు స్పందించారని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై హిమంత విరుచుకుపడ్డారు. రాహుల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి హిందువుననే లేబుల్ వేసుకుని తిరుగుతారని ఓటర్లు కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని కోరారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు.

Updated Date - 2023-09-18T19:31:10+05:30 IST