Satyendar Jain: సుప్రీంకోర్టులో సత్యేంద్ర జైన్ బెయిల్ పిటిషన్
ABN , First Publish Date - 2023-05-15T17:09:20+05:30 IST
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ బెయిలు కోరుతూ సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించారు. మనీ లాండరింగ్ కేసులో జైన్‌ను 2022 మే 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) బెయిలు కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)ను సోమవారంనాడు ఆశ్రయించారు. మనీ లాండరింగ్ కేసులో జైన్‌ను 2022 మే 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జైన్ బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. జైన్ నాలుగు బినామీ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపణగా ఉంది.ఈ ఆరోపణలపై జైన్ తోసిపుచ్చారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని, ఛార్జిషీటు నమోదు తర్వాత తనను ఇంకా జైలులో నిర్బంధించడం సరికాదని కోర్టుకు ఆయన విన్నవించారు. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ 2017లో జైన్‌పై కేసు నమోదుచేయడంతో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. సీబీఐ రిజిస్టర్ చేసిన కేసులో ఆయనకు విచారణ కోర్టు 2019 సెప్టెంబర్ 6న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.