Sceptre: కొత్త పార్లమెంట్ భవనంలో తమిళ శాసన రాజదండం ‘సెంగెల్’.. దీని స్టోరీ ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-05-24T17:54:48+05:30 IST

మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించనున్నట్లు హోమంత్రి అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్అనే చారిత్రక రాజదండం ఉంచనున్నట్లు అమిత్‌షా తెలిపారు.

Sceptre: కొత్త పార్లమెంట్ భవనంలో తమిళ శాసన రాజదండం ‘సెంగెల్’.. దీని స్టోరీ ఏంటో తెలుసా?

న్యూఢిల్లీ: మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building) ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించనున్నట్లు హోమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్(Sengol) అనే చారిత్రక రాజదండం(Sceptre) ఉంచనున్నట్లు అమిత్‌షా తెలిపారు.

సింగోల్(Sengol) వెనక కొన్ని యుగాలతో ముడిపడి ఉన్న సంప్రదాయం ఉందని హోంమంత్రి అమిత్‌షా అన్నారు. అధికార మార్పిడికి చిహ్నంగా దేశచరిత్రలో సెంగోల్ కీలక పాత్ర పోషించిందన్నారు. దీనిపై ప్రధాని మోదీకి సమాచారం అందడంతో సమగ్ర విచారణ చేపట్టి దేశం ముందు పెట్టాలని నిర్ణయించారని అమిత్‌షా అన్నారు. కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం రోజును ఎంపిక చేశారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. సింగోల్ అంటే తమిళంలో అర్థం ‘సంపదతో నిండి ఉన్నది’ అని అమిత్ షా తెలిపారు.

1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన సందర్భంగా తమిళ ప్రజలు సెంగోల్‌ను అప్పటి ప్రధాని నెహ్రూకు బహుకరించారు. ఆగస్టు 14 అర్థరాత్రి ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ రాజదండాన్ని తమిళనాడుకు చెందిన శైవమఠాధితులు తొలి ప్రధాని నెహ్రూకు అందజేశారు. తమిళనాడులోని తిరువడుత్తురై శైవ మఠ పీఠాధిపతి సూచనల మేరకు పాత మద్రాసులో ఓ స్వర్ణకారుడు సెంగెల్‌ను తయారు చేసినట్లు చరిత్ర విశ్లేషకులు చెబుతున్నారు. ‘సెంగోల్’ ఇప్పటి వరకు అలహాబాద్ మ్యూజియంలో ‘నెహ్రూ కలెక్షన్స్’ విభాగంలో ఉంచబడింది.

సెంగోల్‌‌.. పూర్వం తమిళనాడును పాలించిన చక్రవర్తులు శక్తికి సూచకంగా పట్టుకునే ఓ రాజదండమని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ‘సెంగోల్ న్యాయపరమైన పాలనకు ప్రతీక’ అని తమిళ పండితుడు దేవనేయ పవనార్ రాసిన గ్రంథం ‘పజాంతమిజాట్చి’లో దీని ప్రస్తావన ఉంది. సెంగోల్‌ తమిళంలో సెమ్మై అనే తమిళ పదం నుంచి వచ్చింది. సెమ్మై అంటే ‘కోల్’ అంటే రాజదండం.

అయితే కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్(రాజదండం) ఆవిష్కరించడం వెనక అసలు సంగతేంటని ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళ ప్రజలను మచ్చిక చేసుకునేందుకే ఈ రాజదండం ఎపిసోడ్ అని విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-05-24T17:54:48+05:30 IST