Uddhav setback: ఉద్ధవ్‌కు మీనాతాయ్ కాంబ్లి గుడ్‌బై.. షిండే వర్గంలో చేరిక
ABN , First Publish Date - 2023-10-18T18:44:05+05:30 IST
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ముంబై: ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (UBT)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి (Meenatai kambli) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
కరడుగట్టిన శివసైనికురాలిగా మీనాతాయ్‌కి మంచి పేరుంది. బాల్‌థాకరే శివసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీతో ఆమె సన్నిహత సంబంధాలుండేవి. బాలాసాహెబ్ చేపట్టిన ఉద్యమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొనేవారు. ముంబై మహిళా శివసైనికుల్లో గట్టి పట్టు ఉన్న ఆమెను వీరాంగనగా పిలిచేవారు. బాలాసాహెబ్ మృతి అనంతరం ఉద్ధవ్ థాకరే, ఆయన భార్య రేష్మి థాకరేతో సన్నిహత సంబంధాలు కొనసాగించారు. థాకరే పబ్లిక్ ఈవెంట్లను కూడా ఆమె నిర్వహించేవారు. అయితే శివసేన వ్యతికేక, హిందూ వ్యతిరేక వైఖరితో వ్యవహరించే సుష్మా అంధారే ఆ తర్వాత క్రమంలో శివసేనలోకి రావడంతో మీనాతాయ్, పలువురు మహిళా సైనికులు అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. మీనాతాయ్‌కి బదులుగా పార్టీ బాధ్యతలు ఎక్కువగా సుష్మకు అప్పచెప్పడంతో ఎట్టకేలకు ఆమె షిండే శివసేననే నిజమైన శివసేనగా గుర్తించి అందులో చేరినట్టు ఆమె సన్నిహత వర్గాలు తెలిపాయి.