Sonia Gandhi: రాహుల్ నివాసానికి వచ్చిన సోనియా, ప్రియాంక...జైలు శిక్షపై అప్పీల్

ABN , First Publish Date - 2023-04-03T10:59:59+05:30 IST

సీపీసీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ సోమవారం ఉదయం మాజీ ఎంపీ, తనయుడైన రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు....

Sonia Gandhi: రాహుల్ నివాసానికి వచ్చిన సోనియా, ప్రియాంక...జైలు శిక్షపై అప్పీల్
Sonia Gandhi arrives Rahul residence

న్యూఢిల్లీ: సీపీసీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ సోమవారం ఉదయం మాజీ ఎంపీ, తనయుడైన రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు.(Sonia Gandhi arrives) దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఉందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు పరువునష్టం కింద దోషిగా నిర్ధారించి అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. క్రిమినల్ పరువునష్టం కింద దోషిగా నిర్ధారించిన దిగువ కోర్టు ఉత్తర్వులపై సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేయనున్నారు. సూరత్ కోర్టు జైలు శిక్ష విధించిన తర్వాత గాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు విధించడంతోపాటు అతని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి : Dog bite: ప్రభుత్వ ప్రసూతి వార్డులో దారుణం...నవజాత శిశువును నోట కరచుకెళ్లిన కుక్క...ఆపై ఏమైందంటే...

మాజీ కాంగ్రెస్ ఎంపీకి అతని నేరానికి గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.రాహుల్ ఈ కేసులో అప్పీల్ దాఖలు చేయడానికి శిక్షను 30 రోజుల పాటు నిలిపివేశారు. అయితే ఆ శిక్షను కొట్టివేయకపోతే రాహుల్ గాంధీ వచ్చే 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారు.తన నేరాన్ని సవాలు చేసేందుకు రాహుల్ సూరత్‌కు బయలుదేరనున్నారు. దీంతో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం ఉదయం తన కుమారుడి ఇంటికి వచ్చారు. అప్పీలు నేపథ్యంలో సోమవారం ప్రియాంకగాంధీ కూడా రాహుల్ ఇంటికి వచ్చారు.

Updated Date - 2023-04-03T11:28:26+05:30 IST