Odisha Train Accident: రైలు ప్రమాదంపై సోనియాగాంధీ ఆవేదన, ఘటనా స్థలికి అధీర్ రంజన్ చౌదరి

ABN , First Publish Date - 2023-06-03T15:01:31+05:30 IST

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రౌలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఇది చాలా దురదృష్టకర ఘటన అని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు్న్నానని అన్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై సోనియాగాంధీ ఆవేదన, ఘటనా స్థలికి అధీర్ రంజన్ చౌదరి

న్యూఢిల్లీ: ఒడిశా (Odisha) లోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రౌలు ప్రమాద ఘటనపై (Rail Accident) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఇది చాలా దురదృష్టకర ఘటన అని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు్న్నానని అన్నారు. కాగా, ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంస్థలు చేస్తున్న సహాయక కార్యక్రమాలను సమీక్షించాలని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధీర్ రంజన్ చౌదరిని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశించారు.

నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా: అధీర్ రంజన్

కాగా, బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మొదట్నించీ తాను చెబుతూనే ఉన్నానని ఉన్నారు. ''బుల్లెట్ ట్రైన్ల కారణంగా ఎక్కువ మొత్తాన్ని దానికి ఖర్చు చేస్తున్నారు. వందే భారత్ రైళ్ల గురించి ప్రతి రోజూ చెబుతున్నారు. రోజూ 25 లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది చాలా పెద్ద తప్పిదం అవుతుంది. రైళ్లు ఢీకొనకుండా 'యాంటీ డివైస్'ల గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఆ పరికరాలు ఏవీ? మూడు రైళ్లు ఢీకొన్నాయి'' అని అధీర్ రంజన్ చౌదరి సూటిగా ప్రశ్నించారు.

Updated Date - 2023-06-03T15:04:55+05:30 IST