Special train: ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం మీదుగా నేడు ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2023-06-07T08:08:18+05:30 IST
చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్‌కు బుధవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ‘కోరమాం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్‌కు బుధవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ‘కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12842)బదులుగా ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు. వివరాలిలా... ఈ నెల 7వ తేదీ ఉదయం 7 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు (02842) మరునాడు ఉదయం 10.40 గంటలకు షాలిమార్ చేరుకోనుంది. 2 ఏసీ టూ టైర్, 9 స్లీపర్ క్లాస్, 3 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ (దివ్యాం గులు), 1 లగేజ్, బ్రేక్ వ్యాన్, 1 ప్యాంట్రీకార్ కలిగిన ఈ రైలు ఒంగోలు, విజయవాడ, ఏలూరు(Ongolu, Vijayawada, Eluru), తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం, బర్హంపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జైపూర్ రోడ్, భద్రక్, బలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాంగచ్చి స్టేషన్లలో ఆగుతుంది.
షాలిమార్-తిరువనంతపురం రైలు రద్దు: మంగళవారం రాత్రి 11.50 గంటలకు షాలిమార్ నుంచి తిరువనంతపురం బయలుదేరాల్సిన బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22642)ను రద్దు చేసినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది.