Share News

Same-sex marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత లేదు.. తుది తీర్పు వెల్లడి

ABN , First Publish Date - 2023-10-17T14:02:28+05:30 IST

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించే అంశంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై భిన్నాభిప్రాయలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్ వారి వివాహానికి చట్టబద్దత కల్పించలేమని స్పష్టం చేశారు.

Same-sex marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత లేదు.. తుది తీర్పు వెల్లడి

ఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించే అంశంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై భిన్నాభిప్రాయలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్ వారి వివాహానికి చట్టబద్దత కల్పించలేమని స్పష్టం చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై నేడు తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. వారిని దంపతులుగా గుర్తించలేమని పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తుది తీర్పు ఇచ్చింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని అత్యున్నత న్యాయం స్థానం పేర్కొంది. అలాగే ఈ కేసుపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అయితే అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి తీర్పులో సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.


స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వవక్ష చూపించకూడదన్న న్యాయస్థానం.. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లైంగిక ధోరణి కారణంగా వారు బంధంలోకి వెళ్లే హక్కులను నియంత్రిచకూడదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే వివాహేతర జంటలతోపాటు స్వలింగ సంపర్క జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులగా ఉంటారని చట్టం భావించట్లేదని అన్నారు. అలా చేయడం వివక్షతో సమానమని తెలిపారు. దత్తత తీసుకోవడానికి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. జువెనైల్ జస్టిస్ చట్టం అవివాహిత జంటలను దత్తత తీసుకోకుండా నిరోధించలేదని పేర్కొన్నారు. వివాహమైన భిన్న లింగ జంటలు మాత్రమే బిడ్డకు స్థిరత్వాన్ని అందించగలదని రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.

Updated Date - 2023-10-17T14:02:59+05:30 IST