సీఎంపై గవర్నర్ విసుర్లు.. డెల్టా రైతుల జీవితాల్లో వెలుగులివ్వలేనివాళ్లు దేశ ప్రజలకు వెలుగివ్వగలరా?

ABN , First Publish Date - 2023-09-03T08:05:12+05:30 IST

కావేరి జలాలను రప్పించి డెల్టా జిల్లాల రైతుల జీవితాల్లో వెలుగులు నింపలేని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) దేశ ప్రజల

సీఎంపై గవర్నర్ విసుర్లు.. డెల్టా రైతుల జీవితాల్లో వెలుగులివ్వలేనివాళ్లు దేశ ప్రజలకు వెలుగివ్వగలరా?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాలను రప్పించి డెల్టా జిల్లాల రైతుల జీవితాల్లో వెలుగులు నింపలేని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణా, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Telangana and Puducherry State Governor Dr. Tamilisai Soundararajan) యెద్దేవా చేశారు. శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. కర్నాటకలో డీఎంకే కూటమి మిత్రపక్షమే (కాంగ్రెస్‌) అధికారంలో ఉందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కావేరి జలాలను తెప్పించలేకపోయారని, రెండు రాష్ట్రాల నడుమనున్న ఈ సమస్యను పరిష్కరించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపలేనివారంతా దేశ ప్రజల జీవితాల్లో ఎలా వెలుగులు నింపగలరని ప్రశ్నించారు. వీరంతా (ఇండియా కూటమి నేతలు) ముంబాయిలో సమావేశమయ్యారని, అయితే ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ విషయాన్ని మరచిపోయారన్నారు. మునుపు ‘హిందీ తెలియదు పోరా’ అంటూ నినాదాలు ముద్రించిన బనియన్లను ధరించిన ఆయన ఈ సారి ఆ బనియన్లను ధరించే వెళ్ళి ఉండాల్సిందని, అయితే అలా చేయలేదని అన్నారు. ఇలాంటివారంతా చేరి జరుపుతున్న బాగోతాలను చూస్తుంటే ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్లు’ అనే పాత సామెతే గుర్తుకొస్తోందన్నారు. తమ రాష్ట్రాల్లోని సమస్యలను కూడా పరిష్కరించలేనివారంతా ఇప్పుడు భారతదేశాన్ని కాపాడుతామంటూ చేతులు కలుపుకున్నారని తమిళిసై విమర్శించారు.

Updated Date - 2023-09-03T08:05:15+05:30 IST