Share News

Manali Tourist Rush: హాలీడేకి వచ్చారు.. ఇరుక్కుపోయారు

ABN , Publish Date - Dec 25 , 2023 | 03:08 PM

Tourist Rush: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కులుమనాలి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఒకవైపు శీతాకాలం, మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్ వంటి ఈవెంట్లతో వరుస సెలవులు రావడంతో పర్యాటకులు మనాలీకి పోటెత్తారు. దీంతో మంచు కురిసే ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.

Manali Tourist Rush: హాలీడేకి వచ్చారు.. ఇరుక్కుపోయారు

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కులుమనాలి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఒకవైపు శీతాకాలం, మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్ వంటి ఈవెంట్లతో వరుస సెలవులు రావడంతో పర్యాటకులు మనాలీకి పోటెత్తారు. దీంతో మంచు కురిసే ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. మనాలీకి వెళ్లే రోడ్లపై వాహనాలు క్యూ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో మనాలీ నుంచి అటల్ టన్నెల్ వరకు ట్రాఫిక్ రద్దీ ఉందని అధికారులు చెప్తున్నారు.

కాగా శీతాకాలంలో పర్యాటకులు మనాలీని సందర్శించేందుకు ఇష్టపడతారు. ఇక్కడి మంచు కురిసే దృశ్యాలు పర్యాటకులకు కనులవిందు అందిస్తాయి. అందుకే బంధువులు, స్నేహితులతో పలువురు పర్యాటకులు డిసెంబర్, జనవరి నెలల్లో మనాలీకి క్యూ కడతారు. అందులోనూ ఆదివారం, క్రిస్మస్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో రద్దీ మరింత పెరిగింది. ఎక్కడికక్కడ రోడ్లు కిక్కిరిసిపోయాయి. పలు ప్రాంతాల నుంచి మనాలీ వెళ్లే విమానాలు కూడా ఫుల్ అవుతున్నాయి. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ఇక్కట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


మరిన్ని నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 03:18 PM