Tungabhadra: నిలకడగా తుంగభద్ర
ABN , First Publish Date - 2023-08-20T11:02:28+05:30 IST
తుంగభద్ర పై భాగమైన శివమొగ్గ, ఆగెంబె, వర్నాడు, తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రకు వరద చేరిక పూర్తిగా తగ్గిపోయింది.
- వర్షాలు తగ్గడంతో తుంగభద్రకు తగ్గిపోయిన వరద
- ఈ ఏడు వంద టీఎంసీలకూ చేరని వైనం..
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర పై భాగమైన శివమొగ్గ, ఆగెంబె, వర్నాడు, తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రకు వరద చేరిక పూర్తిగా తగ్గిపోయింది. దీంతో గత 10 రోజులుగా తరంగభద్ర జలాశయం(Tarangabhadra Reservoir)లో నీటిమట్టం పెరగడం లేదు. ఇప్పటికే జలాశయం నుండి కుడి, ఎడమ సాగునీటి కాలువలకు నీరు వదలడంతో ప్రస్తుతం జలాశయంలో నీటి నిలువ తగ్గిపోతోంది. జలాశయం ఎత్తు 1633 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 1627.78అడుగులకు నీరు చేరిక జరిగింది. జలాశయం పూర్తి స్థాయిలో నిండడానికి సరాసరి అరు అడుగుల మేర మిగిలి ఉండగా ప్రస్తుతం జలాశయంలో నీటి చేరిక తగ్గిపోగా, జలాశయంలో నిలువ ఉన్న నీటిని సాగునీటి కాలువలకు వదులుతుండడంతో రోజు రోజు నీటి నిలువ తగ్గిపోతోంది. ప్రస్తుతం జలాశయంలో 85.957 టీఎంసీల నీరు నిలువ ఉండగా, 587 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి జలాశయానికి 36,165 క్యూసెక్కుల నీరు వ చ్చి చేరుతుండగా, 86.500 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తుంగభద్ర జలాశయానికి చేరిన నీరు ఒక్క సాగుకే సరిపడుతుంది. 87రోజుల వరకు నీరు పోవచ్చు భారీ వర్షాలు కురిస్తే డ్యాం నిండుతుంది. లేకపోతే తాగు నీటికీ ఇబ్బంది తప్పదని టీబీ డ్యాం రిటైర్డు ఇంజనీర్ ద్వారాకానాథ్ పేర్కొన్నారు.