Tungabhadra: తుంగభద్ర కాలువలకు నవంబరు 30 వరకు నీరు విడుదల

ABN , First Publish Date - 2023-08-17T10:14:18+05:30 IST

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి ఎడమ ప్రధాన కాలువలకు నవంబరు 30వ తేదీ వరకు నీటిని వదలాలని తుంగభద్ర నీటిపారుదల

Tungabhadra: తుంగభద్ర కాలువలకు నవంబరు 30 వరకు నీరు విడుదల

- ఐసీసీ సమావేశంలో తీర్మానం

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి ఎడమ ప్రధాన కాలువలకు నవంబరు 30వ తేదీ వరకు నీటిని వదలాలని తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. కొప్పళ జిల్లా మునిరాబాద్‌ కాడా కార్యాలయంలో బుధవారం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఐసీసీ అధ్యక్షుడు శివరాజ్‌ తంగడిగి నేతృత్వంలో సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి నీటి విడుదల ప్రారంభమైందని, జలాశయంలో నీటి లభ్యం ఉ న్నంత వరకు 4,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తుంగభద్రకు డి ఎగువ (హెచ్చెల్సీ) కాలువలకు నవంబరు 30వ తేదీ వరకు 1300 క్యూసెక్కులు, కుడి దిగువ(ఎల్లెల్సీ) కాలువలకు 850 క్యూసెక్కులు, రాయబసవ కాలువకు 270 క్యూసెక్కులు, ఎడమ ఎగువ కాలువకు 25 క్యూసెక్కులు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 88 టీఎంసీల నీరు నిలువ ఉందని, ఇందులో 65 టీఎంసీలు నీరు కర్ణాటక రాష్ట్రం వంతు లభించనుందన్నారు. ఇప్పటికే 10 టీఎంసీల నీరు వాడుకున్నారని, ఆంధ్రా(Andhra) వాటాలో 3 టీఎంసీలు నీటిని సరఫరా చేశారని తెలిపారు. కర్మాగారాలకు నీటి సరఫరా, కాంట్రాక్టు కార్మికుల వేతన చెల్లింపులకు సంబంధించి ఈనెల 19న బెంగళూరులో జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar), శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బళ్లారి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బి. నాగేంద్ర, రాయచూరు(Raichur) జిల్లా మంత్రి భోసరాజు, ఎంపీ కరెడి సంగన్న, విజయనగర ఎమ్మెల్యే గావియప్పతో పాటు బళ్లారి, రాయచూరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ సీఈఓలు, జిల్లా స్థాయి పోలీసు అధికారులు పాల్గొన్నారు.

pandu3.jpg

Updated Date - 2023-08-17T10:14:18+05:30 IST