Haryana : నుహ్‌‌లో మత ఘర్షణలు.. బుల్డోజర్ యాక్షన్‌లో మెడికల్ స్టోర్స్ కూల్చివేత..

ABN , First Publish Date - 2023-08-05T12:23:24+05:30 IST

హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. నల్హర్‌లోని షహీద్ హసన్ ఖాన్ మేవాతీ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఉన్న దాదాపు 20 మెడికల్ స్టోర్స్‌ను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వీటిని ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

Haryana : నుహ్‌‌లో మత ఘర్షణలు.. బుల్డోజర్ యాక్షన్‌లో మెడికల్ స్టోర్స్ కూల్చివేత..

న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. నల్హర్‌లోని షహీద్ హసన్ ఖాన్ మేవాతీ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఉన్న దాదాపు 20 మెడికల్ స్టోర్స్‌ను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వీటిని ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

నుహ్‌లోని శివాలయం వద్ద బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో పాల్గొన్న భక్తులపై సోమవారం దుండగులు దాడులు చేయడంతో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. నుహ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తౌరు వద్ద అక్రమ వలసదారులు నివసిస్తున్న గుడిసెలను గురువారం తొలగించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

ఇప్పటి వరకు వేర్వేరు చోట్ల దాదాపు 50 నుంచి 60 నిర్మాణాలను కూల్చేశారు. వీటిలో నివసిస్తున్నవారు అరెస్టుల భయంతో పారిపోయారు. ఈ కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అఫ్తాబ్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నుహ్‌లో కూల్చివేస్తున్నవి పేదల ఇళ్లు మాత్రమే కాదని, సామాన్యుల నమ్మకం, విశ్వాసాలను కూడానని ఆరోపించారు. పాత తేదీలతో తమకు నోటీసులిచ్చి, తమ ఇళ్లు, దుకాణాలను కూల్చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారని తెలిపారు. పరిపాలనపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం తప్పుడు చర్యలకు పాల్పడుతోందన్నారు.


హర్యానా పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అధికారులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన హింసాత్మక ఘర్షణలకు, తమ చర్యలకు సంబంధం లేదని చెప్పారు. ఇదిలావుండగా, నుహ్‌లో శనివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. స్థానికులకు కాసేపు కర్ఫ్యూ నుంచి సడలింపు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు

నుహ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం జరిగిన మత ఘర్షణల వెనుక ‘‘బిగ్ గేమ్ ప్లాన్’’ ఉందని హర్యానా రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ (Haryana home minister Anil Vij) చెప్పారు. అయితే లోతైన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆదరాబాదరాగా ఓ నిర్ణయానికి రాబోమని తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామన్నారు. బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర ప్రారంభానికి ముందే, దేవాలయాల వద్ద ఉన్న కొండలు, గుట్టలపైకి దుండగులు ముందుగానే వెళ్లారని, వారి చేతుల్లో లాఠీలు ఉన్నాయని, ప్రవేశ మార్గాల వద్ద కాపుకాశారని తెలిపారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక లేకుండా సాధ్యపడదని చెప్పారు. యాత్రలో పాల్గొన్న భక్తులపైకి తుపాకులతో కాల్పులు జరిపారని చెప్పారు. ఇవన్నీ ఎవరో ఏర్పాటు చేసి ఉండాలన్నారు. తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇదంతా ఓ ప్రణాళికలో భాగమేనని చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం

Updated Date - 2023-08-05T12:23:24+05:30 IST