Uttarpradesh: ఉత్తమ పురుషుడు.. భార్యకు ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త

ABN , First Publish Date - 2023-09-24T15:17:35+05:30 IST

భార్య ఇష్టపడుతున్న వ్యక్తిని కాదని మరొకరిని పెళ్లి(Marraige) చేసుకుంటుంది. భర్త(Husband) ఈ విషయాన్ని గుర్తించి ప్రియుడి(Lover)తో భార్య పెళ్లి జరిపిస్తాడు. ఏంటీ.. సినిమా స్టోరీ అనుకుంటున్నారా? నిజ జీవిత కథే ఇదీ. ఓ భార్యకు తన భర్త ప్రియుడితో పెళ్లి జరిపించాడు.

Uttarpradesh: ఉత్తమ పురుషుడు.. భార్యకు ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త

ఉత్తర్ ప్రదేశ్:భార్య ఇష్టపడుతున్న వ్యక్తిని కాదని మరొకరిని పెళ్లి(Marraige) చేసుకుంటుంది. భర్త(Husband) ఈ విషయాన్ని గుర్తించి ప్రియుడి(Lover)తో భార్య పెళ్లి జరిపిస్తాడు. ఏంటీ.. సినిమా స్టోరీ అనుకుంటున్నారా? నిజ జీవిత కథే ఇదీ. ఓ భార్యకు తన భర్త ప్రియుడితో పెళ్లి జరిపించాడు. ఈ విషయం తెలుసుకుని కొందరు ఉత్తముడు అని పొగుడుతుండగా.. మరి కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఏంటా భార్యభర్త మధ్యలో ప్రియుడి కథ అనుకుంటున్నారా.. చదవండీ మరీ..


ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లోని డియోరియా జిల్లాకి చెందిన యువకుడికి ఓ మహిళతో పెళ్లి అయింది. అయితే ఆమె బిహార్(Bihar) కు చెందిన ఆకాష్ గుప్తాతో ఇదివరకే ప్రేమలో పడింది. ఆమెకు ఇష్టం లేకున్నా ఇంట్లో వాళ్ల కోసం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇదే క్రమంలో ప్రియుడు శుక్రవారం రాత్రి ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు. వారిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఆకాష్ ని స్థానికులు చితకబాదారు. ఆమెను తాను ప్రేమించానని, తనను కలవకుండా ఉండలేనని ప్రేమికుడు భర్త ముందు వాపోయాడు.అతని మాటలకు కరిగిపోయిన భర్త.. తన భార్యను ప్రియుడి చేతిలో పెట్టేశాడు. తానే దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.

Updated Date - 2023-09-24T15:18:54+05:30 IST