Vande Bharat train: రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

ABN , First Publish Date - 2023-09-24T11:31:36+05:30 IST

యశ్వంతపుర - కాచిగూడ(Yeswantapura - Kachiguda)ల మధ్య వందేభారత్‌ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు

Vande Bharat train: రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): యశ్వంతపుర - కాచిగూడ(Yeswantapura - Kachiguda)ల మధ్య వందేభారత్‌ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు నైరుతి రైల్వేజోన్‌ అధికారులు శనివారం ప్రకటించారు. కాచిగూడ నుంచి 24న ఈ రైలు సంచారానికి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ ద్వారా పచ్చజెండా చూపనున్న సం గతి తెలిసిందే. ఈ రైలులో చైర్‌ కార్‌ (సీసీ) కోచ్‌ ధర రూ.1540గాను, ఎగ్జిక్యూటివ్‌ కార్‌ (ఈసీ) కోచ్‌ రూ.2,865గా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈరైలులో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయని బుధవారం మినహా వారంలో 6 రోజులు యశ్వంత పుర నుంచి కాచిగూడ ప్రయాణిస్తుందన్నారు. 20704 నెంబరు వందేభారత్‌ రైలు యశ్వంతపుర స్టేషన్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ధర్మవరం, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌(Dharmavaram, Anantapur, Kurnool, Mahabubnagar) స్టేషన్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. కాచిగూడ నుంచి 20703 నెంబరు వందేభారత్‌ రైలు ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు బయల్దేరి యశ్వంతపురకు మధ్యాహ్నం 2 గంట లకు చేరుకుంటుంది. ప్రధాని ప్రారంభించే ఈ ప్రత్యేక వందేభారత్‌ రైలు 24న మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి అదే రోజు రాత్రి 11.45 గంట లకు యశ్వంతపురకు చేరుకుంటుందని ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు ఈ రైలుకు అదనంగా షాద్‌నగర్‌, గద్వాల్‌, డోన్‌, హిందూపురం, యలహంకలలో కూడా తొలి రోజు మాత్రమే కొద్దిసేపు రైలును ఆపుతామని ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-24T11:31:36+05:30 IST