Share News

Vande Bharat Train: వందేభారత్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN , Publish Date - Dec 27 , 2023 | 11:45 AM

పరిశ్రమల నగరం కోవై నుంచి బెంగళూరు మధ్య ఈ నెల 30న వందే భారత్‌ రైలు సేవలను ప్రధాని నరంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. దేశంలో మొట్టమొదటి వందే భారత్‌ రైలు(Vande Bharat Train) సేవలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.

Vande Bharat Train: వందేభారత్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్యారీస్‌(చెన్నై): పరిశ్రమల నగరం కోవై నుంచి బెంగళూరు మధ్య ఈ నెల 30న వందే భారత్‌ రైలు సేవలను ప్రధాని నరంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. దేశంలో మొట్టమొదటి వందే భారత్‌ రైలు(Vande Bharat Train) సేవలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 వందే భారత్‌ రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రైళ్లకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో, అదనపు రైళ్లు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కోవై నుంచి చెన్నైకి వందేభారత్‌ రైలు నడుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 30వ తేది ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవై- బెంగళూరు మధ్య వందే భారత్‌ రైలు సేవలు ప్రారంభించనున్నారు. కోవై నుంచి బయల్దేరే ఈ రైలు సేలం, ధర్మపురి, హోసూరు మీదుగా బెంగళూరుకు 5.40 గంటల్లో చేరుతుంది. అందుకు చార్జీగా రూ.1,850 నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - Dec 27 , 2023 | 11:51 AM