Carrots: క్యారెట్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? ఆ విషవ్యర్థాలను బయటకు పంపిస్తుందట..!

ABN , First Publish Date - 2023-04-04T15:28:44+05:30 IST

మంచి ఛాయ కావాలనుకునేవారు రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకోవాలి.

Carrots: క్యారెట్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? ఆ విషవ్యర్థాలను బయటకు పంపిస్తుందట..!
carrots

కంటికి మేలు చేసే చాలా ఆహార పదార్థాల్లో ప్రముఖంగా చెప్పుకునేది క్యారెట్ గురించి. దీనిలో అనేక పోషకాలున్నాయి. అప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్నరికి క్యారెట్ ఉడికించి ఇస్తే అది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అంతేనా ఆరోగ్యాన్ని కాపాడే క్యారెట్‌లో ఇంకా చాలా గుణాలున్నాయి. అవేంటంటే..

క్యారెట్ల్ రూట్ కూరగాయ, ఇవి మనకు ఆరెంజ్ కలర్ లోనే కనిపిస్తాయి. కానీ నిజానికి పసుపు, ఎరుపు రంగులలో కూడా క్యారెట్ పండుతుంది. అంతేనా అచ్చం ముల్లంగిని పోలిన తెల్ల క్యారెట్ కూడా చాలాచోట్ల వాడతారు. అయితే ఒక్కోచోట ఒక్కోలా కనిపించడానికి క్యారెట్ ఉన్న భూసారాన్ని బట్టి, అక్కడి ప్రదేశాన్ని బట్టి ఊరుతూ ఉంటాయి. పరిమాణంలో మరీ పెద్దగా పెరగకపోయినా పోషకాల విషయానికి వస్తే క్యారెట్ పోషకాలకు పెట్టింది పేరు. కాస్త తీయగా, మరింత కమ్మదనంతో ఉండే క్యారెట్ చిన్నా పెద్దా అంతా ఇష్టంగా తింటారు. వీటిలో ముఖ్యంగా విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నందువల్ల వీటిని తినడం కంటికి మంచిదని చెబుతారు.

1. క్యారెట్ల‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. దీనిని తీసుకుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. లివ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ క్యారెట్‌ను తింటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివ‌ర్‌లో పేరుకుపోయిన విష ప‌దార్థాలు బ‌య‌టకు పోతాయి.

ఇది కూడా చదవండి: పిల్లలకు పాలల్లో ఇవి కలిపి అస్సలు తినిపించకండి.. తెలియకుండా తినిపిస్తే చేజేతులా పిల్లల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే..!

2. క్యారెట్లు రోజూ తీసుకోవడం వల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. హైబీపీ అదుపులోకి వ‌స్తుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకునే వీలుంటుంది.

3. క్యారెట్లలో ఉండే పోష‌కాలు శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపిస్తాయి. శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించే యాంటీ సెప్టిక్‌గా కూడా క్యారెట్స్ పని చేస్తాయి.

4. గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మానికి తాజాదనాన్ని క్యారెట్‌ అందిస్తుంది. మంచి ఛాయ కావాలనుకునేవారు రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకోవాలి.

పచ్చిగా ఉన్నప్పుడు క్యారెట్ తినచ్చు అలాగే దీన్ని కూర చేసుకొని కూడా ఆహారంలో తీసుకోవచ్చు. క్యారెట్ ఎక్కువగా వినియోగించడం వల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది, కాబట్టి ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. భారతదేశంతో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వారు క్యారెట్ ని ఎక్కువగా వాడుతున్నారు.

Updated Date - 2023-04-04T15:28:44+05:30 IST