World IVF Day 2023: అమ్మా.. అన్న పిలుపు కోసం చిట్టచివరి ప్రయత్నం.. ఐవీఎఫ్‌కు వెళ్లే ముందే ఇవి తెలుసుకోండి..!
ABN , First Publish Date - 2023-07-25T13:08:33+05:30 IST
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట తినడం మానేయాలి. ఈ ఆహారాలలో చికిత్సకు హాని కలిగించే రసాయనాలు పుష్కలంగా ఉంటాయి.
బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు వరం, అలాంటి వరం ఆమెకు దక్కలేదంటే అంతకన్నా బాధ మరొకటి లేదు. అలాంటి సమయంలో కృత్రిమ పద్దతుల ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నించేవారికి చాలా మార్గాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా ఐవీఎఫ్ పద్దతి ఒకటి. ఈ పద్దతి గురించి అవగాహన కోసం ప్రతి యేటా జూలై 25న ప్రపంచ ఐవీఎఫ్ ( IVF) దినోత్సవం లేదా వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే నిర్వహిస్తుంటారు. IVF ద్వారా గర్భం దాల్చగా పుట్టిన మొదటి బిడ్డ పుట్టిన తేదీ సూచకంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రపంచ IVF దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?
1978 జూలై 25న జన్మించిన లూయిస్ జాయ్ బ్రౌన్ IVF విధానం ద్వారా జన్మించిన మొదటి శిశువు. ఆ రోజు నుండి, IVF శిశువులను గర్భం దాల్చడానికి నమ్మదగిన పునరుత్పత్తి విధానంగా గుర్తించబడింది.
IVF చేయించుకున్నప్పుడు చేయవలసినవి, చేయకూడనివి ఏమిటి?
కృత్రిమంగా గర్భం దాల్చడానికి అత్యంత సాధారణ ప్రక్రియలలో IVF ఒకటి. IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్స్. ల్యాబ్‌లో గుడ్డును స్పెర్మ్‌తో ఫలదీకరణం చేయడం ద్వారా IVF ప్రక్రియ జరుగుతుంది. గుడ్డు విజయవంతంగా ఫలదీకరణం చెంది, పిండంగా పెరిగిన తర్వాత, దానిని గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పునరుత్పత్తి శాస్త్రంలో గర్భం ధరించడానికి IVF ప్రక్రియ ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. ఈ పద్దతిలో శిశువు ఆరోగ్యకరమైన పుట్టుక, తల్లి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి.
1. ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎప్పుడూ శరీరానికి మంచి చేస్తుంది. IVF చికిత్స పొందుతున్నప్పుడు, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తినాలి.
2. మంచి నిద్ర
సంతానోత్పత్తిపై నిద్ర చాలా ప్రభావం చూపుతుంది. సరిగ్గా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ కనీసం 7నుంచి 8 గంటల పాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
3. కెఫిన్ మానుకోండి
కెఫిన్ తీసుకోవడం IVF చికిత్సల వైఫల్యానికి దారితీస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అవసరమైతే పరిమిత మొత్తంలో తీసుకోవచ్చు.
4. నీరు, ఇతర ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం..
IVF చికిత్సలో దుష్పభావలను తగ్గించుకోవచ్చు. నీరు, ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ లక్షణాలు తీవ్రతను తగ్గించవచ్చు. ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి సహకరిస్తుంది.
5. తేలికపాటి వ్యాయామం
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం. IVF విధానాలలో ఉన్నప్పుడు, తక్కువ, తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోవాలి.
6. అలంకరణ ఉత్పత్తులు
మేకప్, చర్మ సంరక్షణ, శరీర సంరక్షణ ఉత్పత్తులు పారాగాన్స్, బెంజోఫెనోన్, ట్రైక్లోసన్ మొదలైన వివిధ రసాయనాలను కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తులు చికిత్సకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ప్రోసెస్ జరుగుతుండగా ఎలాంటి ఉత్పత్తులను వాడకపోవడం మంచిది.
7. కలయికకు పరిమితులు..
IVF ప్రక్రియల సమయంలో భార్యాభర్తలు కలవడం మంచిది. కానీ ఇది డాక్టర్ సలహామీద జరగాలి.
8. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు చికిత్స విజయాన్ని తగ్గించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇతరులతో సన్నిహితంగా ఉండేలా చూసుకోండి, యోగా, ధ్యానం మొదలైనవాటిని ప్రయత్నించండి.
9. విటమిన్లు తీసుకోండి.
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో పోషకాల లోపానికి గురవుతారు. ఈ సమయంలో వైద్యుడు సూచించిన విటమిన్లు, ఇతర సప్లిమెంట్లను తప్పకుండా తీసుకోవాలి.
చేయకూడనివి
1. ధూమపానం, మద్యపానం
IVF విధానాలకు ముందు, సమయంలో, తర్వాత ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అవి ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయి.
2. పాదరసం అధికంగా ఉండే ఆహారాలు
పాదరసం అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా మానుకోవాలి. ఎందుకంటే అవి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యానికి కూడా హాని కలిగించవచ్చు.
3. ఆహారంలో ప్రధాన మార్పులు..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. చికిత్సకు ఇది సహకరిస్తుంది.
4. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట తినడం మానేయాలి. ఈ ఆహారాలలో చికిత్సకు హాని కలిగించే భాగాలు, రసాయనాలు పుష్కలంగా ఉంటాయి.
5. డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం
IVF చికిత్సలు, గర్భధారణ సమయంలో తీసుకునే మందులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మందులను తీసుకునే ముందు వైద్యుడిని అడగాలి.