Post Pregnancy Diet: డెలివరీ తర్వాత ఏం తినాలి..? పండంటి బిడ్డకు జన్మనిచ్చాక తల్లులు త్వరగా కోలుకోవాలంటే..!
ABN , First Publish Date - 2023-08-03T16:10:01+05:30 IST
పొట్లకాయ మంచి హైడ్రేషన్ గా ఉండి, తల్లిపాలు ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.
గర్భధారణ తరువాత స్త్రీ శరీరం చాలా మార్పులకు గురవుతుంది. ఇది ఆమె మానసిక, శరీరకమైన ప్రభావానని కలిగి ఉంటుంది. అలాగే గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలను తినకూడదనే ఆంక్షలు కూడా ఉంటాయి. వాటిని బిడ్డ పుట్టాకా తీసేసి, అన్ని పదార్ధాలను తినవచ్చు అని పెద్దలే చెబుతారు. దీనికి కారణం ఏమిటంటే.. అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం అలాగే తల్లి ఆరోగ్యం కూడా ముఖ్యమే. దీనికోసం పోషకాహారం మీద ఆధారపడక తప్పదు. అలాగే బిడ్డకు తల్లినుంచి అందే పోషకాలు పాల ద్వారా మాత్రమే అందుతాయి. వాటిని ఇంకాస్త ఆరోగ్యంగా బిడ్డకు అందివ్వాల్సిన బాధ్యత తల్లిదే. ఇందుకోసం ఏం చేయాలంటే..
బాదం
బాదం ఇది తల్లులకే కాదు.. అన్ని వర్గాల వారికీ గొప్ప డ్రై ఫ్రూట్స్. ఇందులో పెద్ద మొత్తంలో పోషకాహారం, విటమిన్లు ఉన్నాయి. అందువల్ల, డెలివరీ తర్వాత వీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.
వెల్లుల్లి
ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు వెల్లుల్లి చాలా అవసరం. తల్లి తీసుకునే ఆహారంలో వెల్లల్లి చేర్చడం వల్ల శరీరానికి వేడినిస్తుంది.
ఇది కూడా చదవండి: రోజూ పాలు తాగే అలవాటుందా..? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఈ రెండింటినీ కలుపుకుని తాగితే..!
పొట్లకాయ
పొట్లకాయ మంచి హైడ్రేషన్ గా ఉండి, తల్లిపాలు ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. 95% నీటితో ఉంటుంది.
జీలకర్ర
సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ది చెందింది, జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. జీర్ణవ్యవస్థ నుండి రోగనిరోధక వ్యవస్థ వరకు, రక్త ప్రసరణ వరకు, ప్రతిదీ మెరుగుపరుస్తుంది. డెలివరీ తర్వాత శరీరం శక్తిని నిలుపుకోవటానికి, తాజాగా ఉండటానికి సహాయపడతుంది. శరీరానికి సరైన పోషకాహారం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.