Share News

Bathukamma Celebrations: సిడ్నీలో సందడిగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2023-10-20T07:03:23+05:30 IST

సిడ్నీలో బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Bathukamma Celebrations: సిడ్నీలో సందడిగా బతుకమ్మ వేడుకలు

ఆటపాటలతో ఆకట్టుకున్న సిడ్నీలో బతుకమ్మ సంబరాలు

ప్రతి సంవత్సరం పెరుగుతున్న జనాదరణ

Bathukamma Celebrations: సిడ్నీలో బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక బౌమాన్ హాల్ బ్లాక్‌టౌన్ సెంటర్‌లో నిర్వహించిన బ‌తుక‌మ్మ వేడుకల్లో 1,500 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొని వైభవంగా జరుపుకున్నారు.

BB.jpg

మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటపాటతో సిడ్నీ నగరం పుల‌కించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లు మార్మోగాయి. బతుకమ్మ అచ్చతెలుగు మాట.. తెలంగాణ ప్రజల సాంప్రదాయం.. శతాబ్ధాల సంస్కృతి తంగేడు పూల సాహిత్యమాల ఆడబడచుల ఆత్మీయ ఆటల కేళి.. కొత్త జీవన స్ఫూర్తిని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు గొప్ప ఊరట. ఇటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మను సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణవాసులు కన్నుల పండువగా జరుపుకున్నారు.

BBB.jpg

వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. వాటి త‌యారీకి ఉద‌యం నుంచే క‌ష్ట‌ప‌డ్డారు. రంగు రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేశారు. వాటిని త‌యారు చేసిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్రధానం చేశారు.

BBBBBB.jpg

ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక శివ గర్జన డ్రమ్ షో, జమ్మి పూజతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణమైన కార్య నిర్వాహక కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్, డేవిడ్ రాజు, కవిత తోతుకుర్, లత కడపరతి, కావ్య గుమ్మడవల్లి, వాణి ఏలేటి, శ్వేత యమ, శ్వేత తెడ్ల, హారిక మన్నెం, వత్సల ముద్దం, విద్యా సేరి, చేసిన కృషి కారణమని (SBDF) బతుకమ్మ చైర్మన్ - అనిల్ మునగాల తెలిపారు.

BBBBBBBBB.jpg

ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పలు నృత్య ప్రదర్శనల కార్యక్రమాలు జరిగాయి. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటు వంటి కార్యక్రమాలు దానికి ఎంతో సహకరిస్తాయని శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ కొనియాడారు. తర్వాత సిడ్నీ బతుకమ్మ ఇంత విజయవంతం కావటానికి కారణమైన స్పాన్సర్స్, కమ్యూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలంటీర్స్‌కు, కార్యవర్గ సభ్యులకు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ ధన్యవాదాలు తెలియజేశారు.

BBBBBBB.jpg

Updated Date - 2023-10-20T07:04:49+05:30 IST