NRI Woman: యూఎస్‌లో ఉండే ఎన్నారై మహిళకు ఊహించని షాక్.. రూ.14 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు.. పోలీసులు ఏమన్నారంటే..!
ABN , First Publish Date - 2023-07-23T12:48:14+05:30 IST
అమెరికాలో (America) ఉండే ఎన్నారై మహిళకు ఊహించని షాక్ తగిలింది.
చండీగఢ్: అమెరికాలో (America) ఉండే ఎన్నారై మహిళకు ఊహించని షాక్ తగిలింది. చండీగఢ్‌లో ఉన్న ఆమె ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు రూ.4లక్షల నగదుతో పాటు రూ.10లక్షలు విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్ నగరంలోని (Chandigarh City) సెక్టార్-40లో ఎన్నారై అమర్జీత్ కౌర్ సాహ్నీకి (Amarjeet Kaur Sawhney) ఒక పెద్ద ఇల్లు ఉంది. అమర్జీత్ కౌర్ యూఎస్‌లో సెటిల్ కావడంతో చండీగఢ్‌లోని ఆమె ఇంటిని బంధువైన సుగ్రీవ్ యాదవ్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక రోజు రాత్రి కొందరు దొంగలు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు, రూ.4 లక్షల నగదు, విలువైన వాచీలు, కొన్నిఇతర కాస్ట్లీ వస్తువులు ఎత్తుకెళ్లారు.
ఇక ఇంటిని చూసుకునే ఆమె బంధువు సుగ్రీవ్ యాదవ్ మరుసటి రోజు ఆ ఇంటికి వచ్చాడు. ఇంటి తాళాలు తీసి లోపలికి వెళ్లి చూస్తే.. లోపల సామాన్లు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అలాగే లోపలి రెండు గదుల తాళాలు పగలగొట్టబడి ఉండడం చూశాడు. ఇంటి పైకప్పు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు (Thieves) రెండు గదుల తాళాలు పగులగొట్టారు. అనంతరం విలువైన వస్తువులున్న ఒక ట్రంక్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. అందులో రూ.4లక్షల క్యాష్, బంగారు ఆభరణాలు ఉన్నాయట. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు. విలువైన ఆభరణాలు డబ్బులు బ్యాంకు లాకర్లలో స్టోర్ చేసుకోవాలని ప్రజలకు పోలీసులు కోరారు. ఇంట్లో భారీగా డబ్బులు ఉంచుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరించారు.