BRS NRI కువైట్ ఆధ్వర్యంలో దీక్షా దివస్
ABN , First Publish Date - 2023-11-29T06:59:29+05:30 IST
బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ని నిర్వహించడం జరిగింది.
ఎన్నారై డెస్క్: బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన రోజు నవంబర్ 29. 'ఐతే తెలంగాణ రథ యాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర', 'ఎత్తిన జెండా దించినా, ఉద్యమాన్ని ఆపినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి', 'ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడ్త', 'తెలంగాణ వచ్చుడ్డో కేసీఆర్ సచ్చుడో' అంటూ ఎన్నో శపదాలతో చేపట్టిన ఆమరణ దీక్ష పల్లెల్లో, పట్టణాల్లోని విద్యార్థుల్లో మరింత ఉరకలు వేసే విధంగా చేసింది. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. ఆయన స్పూర్తితో తాను కూడా యూనివర్సిటీలో పోరాటం చేసినందుకు తనకు చాలా గర్వంగా గా ఉంది అని అభిలాష తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు ప్రాణ త్యాగం చేశారు. వారందరినీ స్మరించుకుంటూ, అందులో మొదటి అమరుడైనటువటి శ్రీకాంత చారి కూడా నవంబర్ 29th రోజే ప్రాణ త్యాగం చేసి మరింత స్ఫూర్తిని నింపారన్నారు. కేటీఆర్ గల్ఫ్ భీమా ప్రకటించినందుకు BRS NRI కువైట్ తరుపున మరియు గల్ఫ్ కార్మికుల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. తొందర్లోనే గల్ఫ్ పాలసినీ కూడా అమల్లోకి తెస్తాం అని ప్రకటించినందుకు చాలా సంతోషం అని పేర్కొన్నారు. త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం అన్నారు. గత 6 దశాబ్దాలలో జరగని అభివృద్ధి కేవలం 9.5 సంవత్సరాలలో కేసీఆర్ చేసి చూపించారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుంది అని అభిలాష చెప్పారు. కేసీఆర్ పక్కా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని BRS NRI కువైట్ తరుపున ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, ప్రమోద్ కుమార్ మార్క, సురేష్ గౌడ్, అయ్యప్ప, సమియుద్దిన్, జమీల్, రవి సూర్య తదితరులు పాల్గొన్నారు.