DTA: అట్టహాసంగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఉగాది ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-05-02T12:18:34+05:30 IST
అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర ఉన్న డీటీఏ సంఘం (Detroit Telugu Association) మన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా ఉగాది ఉత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించింది.
మన సంస్కృతి మరియు సంప్రదాయాలకు వేడుక DTA ఉగాది ఉత్సవాలు
డెట్రాయిట్: అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర ఉన్న డీటీఏ సంఘం (Detroit Telugu Association) మన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా ఉగాది ఉత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించింది. ఏప్రిల్ 29న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 2,200 మందికి పైగా హాజరయ్యారు. 300 పైగా ప్రతిభావంతులైన పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రముఖ గాయని సునీత మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ తోడవ్వటంతో డీటీఏ (DTA) ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంతో ఆకాశాన్నంటాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రచయిత, మాజీ రాజ్యసభ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరై, తెలుగు పైన ఉన్న అపారమైన అనుభవంతో ఇచ్చిన ప్రసంగం కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులకు ఉత్తేజాన్ని చేకూర్చారు. ఈ కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే.. అత్యంత ప్రతిభావంతులైన పిల్లలు తమ నాట్య, సంగీతంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. తదుపరి గాయని సునీతకు గౌరవార్ధం శాలువాతో తెలుగు ఆడపడుచులు సన్మానం చేశారు.
అనంతరం గాయని సునీత తన బృందంతో కలిసి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు పాటలు పాడి డెట్రాయిట్ ప్రేక్షకులను అలరించారు. మన తెలుగు రుచులు జోడించి రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చెయ్యటం జరిగింది. ప్రతి ఒక్కరికి భోజనం అందేటట్లు డీటీఏ సంఘం చాలా జాగ్రత్తలు తీసుకోవటంతో ఈ కార్యక్రమానికి వచ్చినవారు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి తానా (TANA) బృందం అంజయ్య చౌదరి లావు, హనుమయ్య బండ్ల, సునీల్ పంత్ర, శ్రీనివాస్ గోగినేని, శ్రీని లావు, రాజా కాసుకుర్తి, ఠాగూర్ మల్లినేని, ఉమా అరమాండ్ల కాటికి, జానీ నిమ్మలపూడి, నాగమల్లేశ్వర పంచుమర్తి హాజరయ్యారు. వీరితో పాటు డీటీఏ పూర్వ అధ్యక్షులు నీలిమ మన్నే, జోగేశ్వరరావు పెద్దిబోయిన, కోనేరు శ్రీనివాస్, వెంకట్ ఎక్క, రమణ ముద్దెగంటి, సుధీర్ బచ్చు, ద్వారకా ప్రసాద్ బొప్పన, సత్యం నేరుసు, సంతోష్ ఆత్మకూరి పాల్గొన్నారు. సభా వ్యాఖ్యాతగా ఉదయ్ చాపల మడుగు వ్యవహరించారు.
అంతేకాకుండా ప్రతీది సజావుగా జరిగేలా తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేసిన ఈవెంట్ కోఆర్డినేటర్లు, వాలంటీర్ అయిన కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, సుబ్రత గడ్డం, అర్చన చావళ్ల, ప్రణీత్ నాని, తేజ్ కైలాష్ అంగిరేకుల, దీప్తి చిత్రపు, స్వప్న ఎల్లెందుల, శృతి బుసరి, రాజా తొట్టెంపూడి, సంజు పెద్దికి డీటీఏ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.
ఈ సందర్బంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఇది ఒక మినీ కన్వెన్షన్‌ను తలపించేలా జరిగిందంటూ డీటీఏ అధ్యక్షుడు కిరణ్ దుగ్గిరాలతో పాటు డీటీఏ కార్యవర్గ సభ్యులను ప్రశంసించారు.