Donald Trump: కమలా హ్యారిస్‌పై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్.. బైడెన్‌పై కూడా ఘాటు విమర్శలు..!

ABN , First Publish Date - 2023-08-25T09:42:31+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ (Kamala Harris) పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో (2024 Presidential Election) ఆమె పోటీ చేయడానికి అర్హురాలు కాదని ట్రంప్‌ అన్నారు.

Donald Trump: కమలా హ్యారిస్‌పై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్.. బైడెన్‌పై కూడా ఘాటు విమర్శలు..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ (Kamala Harris) పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో (2024 Presidential Election) ఆమె పోటీ చేయడానికి అర్హురాలు కాదని ట్రంప్‌ అన్నారు. ఆమె విచిత్రమైన యాసలో మాట్లాడుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అటు అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ను కూడా ట్రంప్ విమర్శించారు. అతను శారీరకంగా కంటే మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారన్నారు.

బైడెన్ నిరంతరం పబ్లిక్‌లో పరువు తీసుకోవడం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌లో యుద్ధం వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అతను పని చేయడానికి బదులుగా బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని ట్రంప్ దుయ్యబట్టారు. కాగా, కమలా మాట్లాడే తీరుపై ట్రంప్ ఒక్కరే కాదు ఇంతకుముందు కూడా పలువురు విమర్శలు గుప్పించారు. ఆమె రోబోటిక్‌గా మాట్లాడతారని కొందరు ఆరోపించారు.

ఇక ట్రంప్ (Trump) తాజా వ్యాఖ్యలు వచ్చే ఏడాది అధ్యక్షుడిగా రిపబ్లికన్ (Republican) నామినేషన్‌ను గెలుచుకునే తన సొంత అవకాశాలను మెరుగుపరుకునేందుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆయన తాను మళ్లీ పోటీ అధ్యక్ష బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజాగా కమలా, బైడెన్‌లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే, చివరగా 2024లో దేశాన్ని ఎవరు నడిపించాలనుకుంటున్నారో అమెరికన్ ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పుకొచ్చారు.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అరెస్ట్.. విడుదల..


Updated Date - 2023-08-25T10:58:02+05:30 IST