Flight Services: ఇండియా నుంచి యూఏఈ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే..

ABN , First Publish Date - 2023-05-03T08:42:32+05:30 IST

ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లేవారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి.

Flight Services: ఇండియా నుంచి యూఏఈ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే..

దుబాయ్: ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లేవారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. ఇరు దేశాల మధ్య త్వరలో భారీగా విమాన సర్వీసులు పెంచుతున్నట్లు దుబాయ్ ఆధారిత క్యారియర్ ఫ్లైదుబాయ్ (Flydubai) సీఈఓ ఘైత్ అల్ ఘైత్ (Ghaith Al Ghaith) వెల్లడించారు. భారత విమానయాన మార్కెట్ భారీగా పెరుగుతోంది. యూఏఈ నివాసితులు, భారతీయ పర్యాటకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఘైత్ అల్ ఘైత్ పేర్కొన్నారు. ఈ మార్గాల్లో శరవేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా దుబాయి, యూఏఈ, భారత్ మధ్య మరిన్ని విమాన సర్వీసులకు అవకాశం ఉందన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ, విమానయాన రంగం (Aviation sector) బలమైన ఆర్థిక వృద్ధిని పరిగణలోకి తీసుకుని, ఎయిర్ ఇండియా తన విమానాలను అప్‌డేట్ చేయడంలో భాగంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం పెరగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 80 బిలియన్ డాలర్లతో ఏకంగా 470 విమానాలు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్‌లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఢిల్లీ, ముంబయి నుంచి దుబాయికి (Dubai) అదనపు విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. యూఏఈ, ఇండియా మధ్య విమాన సర్వీసుల కొరత కారణంగా ప్రయాణ సీజన్లలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాగా, ఎమిరేట్స్‌లో సుమారు 30.50లక్షల మంది భారతీయ ప్రవాసులు ఉంటున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవల ఎమిరేట్స్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ సైతం ఇరు దేశాల మధ్య అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను కూడా పెంచాలని భారత ప్రభుత్వానికి కోరడం జరిగింది.

Kuwait: 11.50లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీలు రద్దు చేసిన కువైత్.. అయినా ఇప్పటికీ మనోళ్లే టాప్!


Updated Date - 2023-05-03T08:42:32+05:30 IST