Kuwait: ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కువైత్ మరో సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2023-05-02T13:22:40+05:30 IST

ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల (Expatriates Driving License) విషయంలో కువైత్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Kuwait: ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కువైత్ మరో సంచలన నిర్ణయం!

కువైత్ సిటీ: ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల (Expatriates Driving License) విషయంలో కువైత్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వలసదారులకు మూడు సంవత్సరాల బదులుగా ఒక ఏడాది మాత్రమే చెల్లుబాటయ్యేలా ఆన్‌లైన్‌లో రెన్యూవల్ (Renewal) చేయనున్నట్లు కువైత్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కొంతమంది ప్రవాసులు లైసెన్స్‌లను మూడేళ్లకు రెన్యూవల్ చేసుకుని ఆపై వృత్తిని మార్చుకుంటున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ప్రవాసులకు (Expats) మూడేళ్ల కాలానికి లైసెన్స్‌ల పునరుద్ధరణ పూర్తిగా నిలిపివేయాలని కువైత్ సర్కార్ నిర్ణయించింది. ప్రవాసులు డ్రైవింగ్ వృత్తిలో కొనసాగిన పక్షంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా యేటా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ వృత్తిలో మార్పు వస్తే దానికి సంబంధించిన విధివిధానాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం (Traffic Department) ప్రకటించింది.

ఇదిలాఉంటే.. గతేడాది చివరలో ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior).. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్లు పొందిన ప్రవాసుల ధృవపత్రాలను మరోసారి తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వలసదారులకు సంబంధించిన ఫైళ్లను పునఃపరిశీలించింది. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్, వాటి తాలూకు ధృవపత్రాలను మంత్రిత్వశాఖ అధికారులు తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఒకవేళ ఎవరైనా తప్పుడుమార్గంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తేలితే వారికి సమన్లు పంపించండంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్లను (Driving License) శాశ్వతంగా రద్దు చేసింది. ఇలా గతేడాది పలువురు ప్రవాసులు భారీగానే డ్రైవింగ్ లైసెన్సులను కోల్పోవడం జరిగింది.

Kuwait: 11.50లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీలు రద్దు చేసిన కువైత్.. అయినా ఇప్పటికీ మనోళ్లే టాప్!


Updated Date - 2023-05-02T13:22:40+05:30 IST