NRI: ఎన్నారై బీఆర్‌యస్ యూకే ప్రత్యేక ఎన్నికల కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2023-08-26T09:59:55+05:30 IST

ఎన్నారై బీఆర్‌యస్ యూకే కార్యవర్గం లండన్‌లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి ఎన్నారై బీఆర్‌యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిధిగా హాజరై కార్యవర్గానికి దిశా నిర్దేశం చేశారు.

NRI: ఎన్నారై బీఆర్‌యస్ యూకే ప్రత్యేక ఎన్నికల కమిటీ ఏర్పాటు

* చైర్మన్‌గా నవీన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రవి ప్రదీప్ పులుసు

* కేసీఆర్‌ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేయ్యడమే లక్ష్యంగా కార్యాచరణ

లండన్: ఎన్నారై బీఆర్‌యస్ యూకే కార్యవర్గం లండన్‌లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి ఎన్నారై బీఆర్‌యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిధిగా హాజరై కార్యవర్గానికి దిశా నిర్దేశం చేశారు. ఎన్నారై బీఆర్‌యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌యస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నారై బీఆర్‌యస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని, దాని కోసం ఒక ప్రత్యేక ఎన్నికల కమిటీని రూపొందించి ప్రకటించారు.

TT.jpg

ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నవీన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రవి ప్రదీప్ పులుసు వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే వీరితో పాటు దాదాపు 15 సభ్యులు ఉంటారని అశోక్ చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రూపాల్లో వినూత్నంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌యస్ ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తోందని తెలియజేశారు. ఎలాగైతే గతంలో అన్ని రకాల ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిందో రానున్న ఎన్నికల్లో సైతం అదే విధంగా పని చేస్తోందని ఎన్నారై బీఆర్‌యస్ యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల వెల్లడించారు.

TTT.jpg

ఎన్నారై బీఆర్‌యస్ యూకే అడ్వైజరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. నేడు సోషల్ మీడియా ప్రభావం అభ్యర్థుల గెలుపులో ఎంతో కీలకంగా మారిందని గుర్తు చేశారు. ఉద్యమ సమయం నుండి ఎన్నారై బీఆర్‌యస్ యూకే.. సోషల్ మీడియా వేదికగా పార్టీకి ఎంతో సేవలందించిందని గుర్తు చేస్తూ రానున్న ఎన్నికల్లో కూడా పార్టీ అధికారిక సోషల్ మీడియా బృందంతో కలిసి పని చేస్తుందన్నారు. తప్పకుండా బీఆర్‌యస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. ఎన్నికల కమిటీ చైర్మన్ నవీన్ రెడ్డి, వైస్ చైర్మన్ రవి ప్రదీప్ పులుసులు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎంతో ముఖ్యమైన బాధ్యతను ఇచ్చి ప్రోత్సహించిన అనిల్ కూర్మాచలం, అశోక్ గౌడ్ దూసరి, సహకరించిన కార్యవర్గానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ని హ్యాట్రిక్ సీఎం చేయ్యడమే లక్ష్యంగా బీఆర్‌యస్ పార్టీ గెలుపునకై వివిధ కార్యక్రమాల్ని రూపొందించి, అటు క్షేత్రస్థాయిలోని నాయకుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని అన్నారు.

TTTT.jpg

ఎన్నారై బీఆర్‌యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నేడు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారని ప్రశంసించారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే కచ్చితంగా కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని, బీఆర్‌యస్ ప్రభుత్వమే ఉండాలని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆశించినట్టు ఆకాంక్షించినట్టు ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. అదే విశ్వాసంతో ఏకధాటిగా ఒకేసారి 115 మంది అభ్యర్ధులని కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ఇలాంటి దమ్మున్న నాయకుడు దేశంలో ఎక్కడా లేరని, ఇలాంటి నాయకత్వాన్ని మనమంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలో కార్యవర్గానికి దిశా నిర్దేశం చేశారు. గులాబీ జెండా మోసే అవాకాశాన్ని అదృష్టాన్ని కల్పించడమే కాకుండా చైర్మన్‌గా నియమించి ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎల్ల వేళలా అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌యస్ నాయకులకు కార్యకర్తలకు కార్యవర్గమంతా కృతఙ్ఞతలు తెలిపారు.

TTTTT.jpg

ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించాలని, మన కోసం ఆలోచించే కేసీఆర్‌ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. మోసపోతే గోసపడ్తామని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌యస్ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేయ్యాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్‌యస్ యూకే కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, హరినవాపేట్, వినయ్ ఆకుల, రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గొట్టెముక్కల సతీష్ రెడ్డి, సేరు సంజయ్, సత్యపాల్ రెడ్డి పింగళి, రమేష్ ఎసెంపల్లి, సృజన్ రెడ్డి, నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ మామిడాల, ప్రశాంత్ కటికనేని, పృథ్వీ, ప్రశాంత్, మధు, రామకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

TTTTTT.jpg

Updated Date - 2023-08-26T09:59:55+05:30 IST