Share News

Kuwait: భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఇండియా-కువైత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2023-10-25T08:05:23+05:30 IST

కువైత్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన ఇండియా-కువైత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌ (India-Kuwait Technology Conference) లో ఐటీ సెక్టార్‌లోని దాదాపు 20 ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి.

Kuwait: భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఇండియా-కువైత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్

కువైత్ సిటీ: కువైత్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన ఇండియా-కువైత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌ (India-Kuwait Technology Conference) లో ఐటీ సెక్టార్‌లోని దాదాపు 20 ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కాన్ఫరేన్స్‌కు ఉన్నత స్థాయి కువైత్ ప్రభుత్వ అధికారులు, కువైత్ అగ్ర సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్‌మెన్ హాజరయ్యారు. కువైత్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా (Adarsh Swaika), సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కువైత్ డైరెక్టర్ జనరల్ డా. అమర్ అల్-హుసైనీ, భారత్ నుంచి నాస్కామ్ (NASSCOM) ప్రతినిధులు హాజరు కావడం జరిగింది.

Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్


Adarsh-Swaika.jpg

ఈ సందర్భంగా భారత రాయబారి ఆదర్శ్ స్వైకా మాట్లాడారు. భారతీయ టెక్నాలజీ సెక్టార్ (Indian Technology Sector) ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరంలో 245 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడిందని చెప్పిన ఆయన.. ఐటీ ఎక్స్‌పోర్ట్స్ వచ్చేసి 194 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడ్డాయన్నారు. టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం భారత్ మూడో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా ఉండడం గర్వకారణం అన్నారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ సవాళ్లకు స్కేలబుల్, సురక్షితమైన, సమగ్ర పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

Updated Date - 2023-10-25T08:06:30+05:30 IST