Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్
ABN , First Publish Date - 2023-10-25T07:18:56+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెకండ్ శాలరీ స్కీమ్స్ (Second salary schemes) సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులు (Indian Expats) దూసుకెళ్తున్నారు. ఈ పొదుపు పథకాల సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారిలో మనోళ్లే టాప్‌లో ఉన్నట్లు తాజాగా వెలువడిన అధికారిక నివేదిక గణాంకాల ద్వారా తెలిసింది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెకండ్ శాలరీ స్కీమ్స్ (Second salary schemes) సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులు (Indian Expats) దూసుకెళ్తున్నారు. ఈ పొదుపు పథకాల సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారిలో మనోళ్లే టాప్‌లో ఉన్నట్లు తాజాగా వెలువడిన అధికారిక నివేదిక గణాంకాల ద్వారా తెలిసింది. ప్రత్యేకించి దక్షిణ, ఆగ్నేయాసియా నుండి వలస వచ్చిన ప్రవాసులు (Expats) తమ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఇటీవల పొదుపు, పెట్టుబడి జాతీయ బాండ్లు, ఎమిరేట్స్ డ్రా ద్వారా రెండో జీతం పథకాలను అక్కడి సర్కార్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక నేషనల్ బాండ్స్ సెకండ్ శాలరీ ప్లాన్ కేవలం నెలకు 1000 దిర్హమ్స్ (రూ. 22,654) తో ప్రారంభం అవుతోంది.
ఈ స్కీమ్ సబ్‌స్క్రైబర్లు 3 నుంచి 10 ఏళ్ల వ్యవధితో పొదుపు పథకాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. పొదుపు వ్యవధి ముగిసిన తర్వాత వారు ప్రతి నెలా వారి ఎంపిక వ్యవధికి అనుగుణంగా ప్రధాన మొత్తాన్ని, లాభాన్ని ఆదాయంగా పొందుతారు. అదే సమయంలో ఎమిరేట్స్ డ్రా విజేతకు 25 ఏళ్ల పాటు నెలకు 25వేల దిర్హమ్స్ (రూ.5.66లక్షలు) గ్రాండ్ ప్రైజ్‌మనీ అందజేస్తుంది. ఇప్పటివరకు ఎమిరేట్స్ డ్రా విజేతలో ఎక్కువ మంది దక్షిణ, ఆగ్నేసియా ప్రాంతాల జాతీయులే ఉన్నారు. నేషనల్ బాండ్స్ సేవింగ్స్ నివేదిక ప్రకారం ఈ ప్లాన్‌లో నమోదు చేసుకున్న మొదటి ఐదు జాతీయులలో ఇండియన్స్ 53 శాతంతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా యూఏఈ జాతీయులు (13శాతం), ఫిలిపినోలు (8శాతం), పాకిస్థానీయులు (5శాతం), జోర్డానియన్లు (2శాతం) ఉన్నారు.