Canada: వీడిన భారతీయ యువతి మర్డర్ మిస్టరీ.. హంతకుడి గుర్తింపు.. కిల్లర్ కోసం దేశవ్యాప్తంగా వేట..!

ABN , First Publish Date - 2023-04-26T08:25:16+05:30 IST

కెనడాలో(Canada) గతేడాది చివరలో 21 ఏళ్ల భారత సంతతి సిక్కు యువతి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.

Canada: వీడిన భారతీయ యువతి మర్డర్ మిస్టరీ.. హంతకుడి గుర్తింపు.. కిల్లర్ కోసం దేశవ్యాప్తంగా వేట..!

ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) గతేడాది చివరలో 21 ఏళ్ల భారత సంతతి సిక్కు యువతి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఈ కేసులో హంతకుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం దేశవ్యాప్తంగా వేట కొనసాగిస్తున్నారు. 2022 డిసెంబర్ 3న మిస్సిసాగాలోని (Mississauga) గ్యాస్ స్టేషన్ బయట గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్ టౌన్‌సిప్ నివాసి అయిన పవన్ ప్రీత్ కౌర్ (Pawanpreet Kaur) అనే యువతిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. కెనడాలో ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. డిసెంబర్ 3వ తేదీ రాత్రి 10.40 గంటల ప్రాంతంలో బ్రిటానియా రోడ్ వెస్ట్‌లో ఉన్న పెట్రో కెనడాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పీల్ రీజినల్ పోలీసులు (Peel Regional Police) తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బుల్లెట్ గాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కౌర్‌ను దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదని, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే, 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పవన్‌ప్రీత్‌ను హత్య చేసిన హంతకుడిని అరెస్ట్ చేయకపోవడంతో అక్కడి పోలీస్ యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పీల్ రీజనల్ పోలీస్ అనుబంధ విభాగం హోమిసైడ్ బ్యూరో (Homicide Bureau) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్‌ప్రీత్‌ను హత్య చేసిన వ్యక్తిని గుర్తించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. ధరమ్ సింగ్ ధాలివాల్‌ (Dharam Singh Dhaliwal) అనే పంజాబీ యువకుడే ఆమెను హత్య చేసినట్లు తెలిపింది. ఈ మేరకు 30 ఏళ్ల ధరమ్ సింగ్ కోసం అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలియజేసింది. అంతేగాక అతడు గతేడాది కనిపించకుండా పోయాడని, ఇది పవన్‌ప్రీత్ హత్య పథకంలో భాగమని తమ దర్యాప్తులో తేలినట్లు పీఆర్‌పీ వెల్లడించింది.

Indian American: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం..!


ఇక ధరమ్ సింగ్ 5. 8 అడుగుల ఎత్తు, 170 పౌండ్ల బరువు, అతని ఎడమ చేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు హంతకుడి వివరాలను తెలియజేశారు. అతడి గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే అతని కుటుంబ సభ్యులలో ఇద్దరిని ఏప్రిల్ 18న న్యూ బ్రున్స్‌విక్‌లోని (New Brunswick) మోంక్టన్‌లో (Moncton) అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రీత్‌పాల్ ధాలివాల్ (25), అమర్‌జిత్ ధాలివాల్ (50)గా పోలీసులు వెల్లడించారు. అంతేగాక ధరమ్ సింగ్‌కు ఎవరైనా సహాయం చేసినా, ఆశ్రయం కల్పించినా వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు వార్న్ చేశారు.

US Visas: భారతీయులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది మనోళ్లకు భారీగా వీసాలు..!

Updated Date - 2023-04-26T08:25:16+05:30 IST