UK: మహిళపై వేధింపులు.. రైలులో ప్రయాణిస్తుండగా వికృత చేష్టలు.. బ్రిటన్‌లో భారత వ్యక్తికి జైలు
ABN , First Publish Date - 2023-10-17T09:50:56+05:30 IST
పరాయి దేశంలో ఉన్నామనే సోయిలేకుండా భారత సంతతి వ్యక్తి (Indian Origin Man) చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై భారతీయ వ్యక్తికి బ్రిటన్ కోర్టు (Britain Court) జైలు శిక్ష విధించింది.
ఎన్నారై డెస్క్: పరాయి దేశంలో ఉన్నామనే సోయిలేకుండా భారత సంతతి వ్యక్తి (Indian Origin Man) చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై భారతీయ వ్యక్తికి బ్రిటన్ కోర్టు (Britain Court) జైలు శిక్ష విధించింది. రైలులో (Train) ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో 16 వారాల జైలు శిక్షతో పాటు లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో ఏడేళ్లపాటు ఉంచాల్సిందిగా యూకే కోర్టు ఆదేశించింది. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ కౌంటీలోని శాండ్‌వెల్‌లో నివాసం ఉండే ముఖన్ సింగ్ (Mukhan Singh) కు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అలాగే 128 పౌండ్ల (రూ. 12,996) సర్‌చార్జ్ చెల్లించాలని ఆదేశించింది.
న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన రోజు 20 ఏళ్ల బాధితురాలు బర్మింగ్‌హామ్ మూర్ స్ట్రీట్ నుంచి లండన్ మేరిల్‌బోన్‌కు రైలులో ప్రయాణిస్తోంది. అదే రైలులో ముఖన్ సింగ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెను అతడు అదే పనిగా చూడటం చేశాడు. కాసేపటి తర్వాత డైరెక్ట్‌గా వెళ్లి ఆమె పక్కన కూర్చొన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే, బాధితురాలు అతడి వికృత చేష్టలను తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. అనంతరం అతడు లీమింగ్టన్ స్పా (Leamington Spa) వద్ద రైలు దిగి వెళ్లిపోతుండగా భద్రతా సిబ్బందిని ఆమె అప్రమత్తం చేసింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ముఖన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు యూకే కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో శిక్ష ఖరారు అయింది.