Indian Origin Techie: 'మెటా'కు గట్టి షాకిచ్చిన భారత సంతతి మహిళ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-07-13T11:17:21+05:30 IST

సింగపూర్‌ (Singapore) లో టెక్ రంగంలో పనిచేస్తున్న వైష్ణవి జయకుమార్ (Vaishnavi Jayakumar) అనే భారత సంతతి మహిళా టెకీ.. ఫేసుబుక్ మాతృ సంస్థ 'మెటా'కు తాజాగా గట్టి షాకిచ్చారు.

Indian Origin Techie: 'మెటా'కు గట్టి షాకిచ్చిన భారత సంతతి మహిళ.. అసలేం జరిగిందంటే..

సింగపూర్‌ సిటీ: సింగపూర్‌ (Singapore) లో టెక్ రంగంలో పనిచేస్తున్న వైష్ణవి జయకుమార్ (Vaishnavi Jayakumar) అనే భారత సంతతి మహిళా టెకీ.. ఫేసుబుక్ మాతృ సంస్థ 'మెటా'కు తాజాగా గట్టి షాకిచ్చారు. కాలిఫోర్నియా పౌర హక్కుల డిపార్ట్‌మెంట్‌ (California's Civil Rights Department) కి 'మెటా' సంస్థపై తాజాగా ఆమె ఫిర్యాదు చేశారు. టెక్ దిగ్గజం మెటా తన జాతి కారణంగా తన పట్ల వివక్ష చూపిందని ఆరోపించారు. తాను ఆసియావాసి (Asian) కావడం వల్లే తన పట్ల కంపెనీ అన్యాయంగా ప్రవర్తించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ జాతి వివక్ష (Racial discrimination) కారణంగానే తనకు ప్రమోషన్లు, ఇతర ఉద్యోగావకాశాలు లభించలేదని వైష్ణవి ఆరోపించారు.

ఇతర అభ్యర్థుల కంటే తనకు ఎక్కువ అనుభవం ఉన్నా.. నాయకత్వ స్థానానికి అర్హత పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే తక్కువ అనుభవం ఉన్న తన సహోద్యోగులతో పోలిస్తే తనతో భిన్నంగా సంస్థ అధికారులు వ్యవహరించారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమైన ప్రాజెక్ట్స్ తన కంటే తక్కువ పని అనుభవం ఉన్నవారికి అప్పగించారని దుయ్యబట్టారు. కాగా, వైష్ణవి మెటా (Meta) లో కంపెనీ యాప్‌లు, సర్వీసులు యువతను ఆకర్షించే విధంగా ఉండేలా చూసుకునేవారు. సంస్థలో చేరిన ప్రారంభంలో అంతా బాగానే ఉందని చెప్పిన ఆమె.. మొదట తాను చేసిన పనికి మంచి స్పందన వచ్చిందన్నారు. కానీ, రెండేళ్ల తర్వాత ప్రమోషన్‌ విషయమై అడిగినప్పుడు కంపెనీ యాజమాన్యం తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇవ్వడం మానేసిందని వైష్ణవి ఆరోపించారు. ముఖ్యంగా మేనేజర్ తన జాతిని తక్కువ చేసి చూడటం ప్రారంభించారని వాపోయారు.

Bahrain: ప్రవాసులకు బెస్ట్ డెస్టినేషన్‌గా బహ్రెయిన్


ఇక మెటాలో పనిచేసే వారిలో దాదాపు సగం మంది ఆసియన్లు (Asians) ఉన్నా కూడా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో మాత్రం నాలుగింట ఒక వంతు మాత్రమే ఆసియన్లు ఉన్నారని తెలిపారు. ఇదిలాఉంటే.. మెటా ఇటీవల వైష్ణవితో పాటు చాలా మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, తన ఫిర్యాదుకు ప్రతీకారంగా సంస్థ తనకు ఉద్వాసన పలికిందని ఆమె వాపోయారు. మెటా తమ విధానాల్లో మార్పులు చేయాలని వైష్ణవి తన ఫిర్యాదులో సూచించారు. కాగా, ఈ విషయమై 'మెటా' ఇప్పటివరకు స్పందించలేదు.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-13T11:17:50+05:30 IST