India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!
ABN , First Publish Date - 2023-10-28T07:27:42+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్తున్నారా..? అయితే మీరు తీసుకెళ్లే మీ లగేజీలో కొన్ని వస్తువులు లేకుండా చూసుకోవడం బెటర్.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్తున్నారా..? అయితే మీరు తీసుకెళ్లే మీ లగేజీలో కొన్ని వస్తువులు లేకుండా చూసుకోవడం బెటర్. ఈ మేరకు నివాసితులు, విదేశీ టూరిస్టులకు (Foreign Tourists) ఆ దేశంలో నిషేధించిన వస్తువుల (Prohibited items) ల అప్‌డేటెడ్ జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలోని ఏ చిన్న వస్తువు మీ లగేజీలో ఉన్నాసరే మీకు అక్కడ ఇబ్బందులు తప్పవు. ఇక కొన్ని వస్తువులను మాత్రం యూఏఈ తీసుకెళ్లడానికి ముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా స్థానిక చట్టాలను ఉల్లంఘించకుండా మీ టూర్‌ను సాఫీగా కొనసాగించవచ్చు. ఇక పర్యాటకం, బిజినెస్, ఉద్యోగం, ఉపాధి కోసం నిత్యం భారీ సంఖ్యలో భారతీయులు ఈ గల్ఫ్ దేశానికి వెళ్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే పండుగలు, ప్రత్యేక సందర్భాలలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai International Airport) అధికారులు.. యూఏఈ (UAE) కి విదేశీ టూరిస్టులు తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు. ఈ వస్తువులు తరచూ అక్కడికి వెళ్లే ప్రయాణికుల లగేజీలలో కనిపిస్తున్నట్లు కూడా వారు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ విడుదల చేసిన యూఏఈ తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను పరిశీలిస్తే..
Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్
* ఎండు కొబ్బరి
* బాణసంచా
* పార్టీ పాపర్స్
* అగ్గిపెట్టేలు
* పెయింట్ డబ్బాలు
* ఆర్తి కర్పూరం
* నెయ్యి
* పచ్చళ్లు (చట్నీలు)
* నూనేతో చేసిన ఆహార పదార్థాలు
* నియంత్రిత మందులు, మాదకద్రవ్య పదార్థాలు
* ఫ్రోజెన్ పౌల్ట్రీ, పక్షులు
* తమలపాకులు
* నకిలీ/పైరేటెడ్ వస్తువులు, కంటెంట్
* జూదం సాధనాలు, యంత్రాలు
* నకిలీ కరెన్సీ
* చేతబడి, మంత్రవిద్య లేదా చేతబడిలో ఉపయోగించే వస్తువులు
* ఇస్లామిక్ బోధనలు మరియు విలువలకు విరుద్ధంగా లేదా సవాలు చేసే ప్రచురణలు, కళాకృతులు
UAE: నివాసితుల వీసా, పాస్‌పోర్ట్ వివరాల కోసం.. యూఏఈలో మరో నయా టెక్నాలజీ
ఇక దుబాయి తీసుకెళ్లేందుకు ముందుగా అనుమతి పొందాల్సిన వస్తువుల జాబితా..
* జంతువులు, మొక్కలు, ఎరువులు
* మందులు, మందులు, వైద్య పరికరాలు
* మీడియా ప్రచురణలు
* ట్రాన్స్‌మిషన్ మరియు వైర్లెస్ పరికరాలు
* మద్య పానీయాలు
* సౌందర్య సాధనాలు
* ప్రదర్శనల కోసం వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు
* ఇ-సిగరెట్లు మరియు ఎలక్ట్రానిక్ హుక్కా