Lulu ONAM Celebrations: కువైత్‌లో ఘనంగా ఓనం వేడుకలు.. థ్రిల్లింగ్‌గా 'టగ్ ఆఫ్ వార్' గేమ్..!

ABN , First Publish Date - 2023-08-27T11:04:58+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

Lulu ONAM Celebrations: కువైత్‌లో ఘనంగా ఓనం వేడుకలు.. థ్రిల్లింగ్‌గా 'టగ్ ఆఫ్ వార్' గేమ్..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లులూ గ్రూప్ (Lulu Group) వారు నిర్వహించిన 'టగ్ ఆఫ్ వార్' (Tug of War) గేమ్ ప్రవాసులకు మంచి థ్రిల్‌ను అందించింది. ఆగస్టు 25వ తేదీన అల్రాయ్ ఔట్‌లెట్‌లో హై-ఎనర్జీ టగ్ ఆఫ్ వార్ పోటీలు జరిగాయి. అల్వాజాన్, అఫియా, ఇఫ్కో (IFFCO), నూర్ అయిల్‌తో సహా పలు ప్రముఖ సంస్థలు ఈ పోటీలను స్పాన్సర్ చేశాయి.

Onam-Celebrations-in-Kuwait.jpg

ఇక ఈ పోటీలలో మొత్తం 12 జట్లు పాల్గొనడం విశేషం. ప్రతి ఒక్కరు తమ బలం, జట్టు కృషితో విజయం సాధించాలనే సంకల్పంతో ఈ పోటీలలో ముందుకు సాగారు. ఈ పోటీలను 'కువైత్ కేరళ టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్' (Kuwait Kerala Tug of War Association- KKTA) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లులూ కువైత్ టాప్ మేనేజ్‌మెంట్, స్పాన్సర్ చేసే కంపెనీల ప్రతినిధులు పాల్గొని, విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు, షీల్డ్స్‌ను అందజేశారు. ఎంతో కోలాహాలంగా జరిగిన ఈ వేడుకలు కువైత్‌లోని భారతీయ ప్రవాసులకు విదేశాల్లో ఉన్నామనే భావనను మరిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tug-of-war.jpg

Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!

Updated Date - 2023-08-27T11:04:58+05:30 IST