Kuwait: నివాసితులు, ప్రవాసులకు వార్నింగ్.. ఇకపై అలాంటి సందేశాల పట్ల జాగ్రత్త అంటూ..
ABN , First Publish Date - 2023-11-07T07:49:13+05:30 IST
నివాసితులు, ప్రవాసులకు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కువైత్ సిటీ: నివాసితులు, ప్రవాసులకు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ట్రాఫిక్ జరిమానాలు (Traffic Fines) చెల్లించమని వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుర్తుతెలియని వెబ్‌సైట్లు, ఫేక్ సందేశాలకు ఎట్టిపరిస్థితుల్లో స్పందించవద్దని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా కోరింది. కొందరు కేటుగాళ్లు నకిలీ సందేశాల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సింది బోగస్ లింక్స్ పంపించడం జరుగుతుందని, అలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దని తెలిపింది.
Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!
ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉంటే.. అధికారిక 'సహెల్ యాప్' (Sahel App) పై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సందేశాలు పంపుతుందని అధికార యంత్రాంగం వివరించింది. అలాంటి సందేశాలకు మాత్రమే స్పందించి నిర్ధేశిత సమయంలోగా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని అధికారులు తెలిపారు. అనవసరంగా ఫేక్ సందేశాలకు స్పందించి డబ్బులు పొగొట్టుకోవద్దని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) వార్న్ చేసింది. నకిలీ సందేశాల ద్వారా భయపెట్టే ప్రయత్నాలు జరిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.