Shocking Incident: మెల్‌బోర్న్‌లో ఘోరం.. బర్త్‌డే నాడు భారతీయ టీనేజర్‌పై పాశవిక దాడి!

ABN , First Publish Date - 2023-08-01T12:42:32+05:30 IST

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ (Melbourne) లో ఘోరం జరిగింది. పుట్టినరోజు నాడే ఓ భారతీయ టీనేజర్‌పై కొందరు యువకులు విచక్షణరహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు.

Shocking Incident: మెల్‌బోర్న్‌లో ఘోరం.. బర్త్‌డే నాడు భారతీయ టీనేజర్‌పై పాశవిక దాడి!

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ (Melbourne) లో ఘోరం జరిగింది. పుట్టినరోజు నాడే ఓ భారతీయ టీనేజర్‌పై కొందరు యువకులు విచక్షణరహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మెల్‌బోర్న్‌లోని టార్నెట్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల భారత సంతతి టీనేజర్ (Indian Origin Teenager) రియాన్ సింగ్ తన ఇద్దరు మిత్రులను బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం తన ఇంటికి పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ముగ్గురు ఇంటికి సమీపంలోని ఓ మైదానంలో బాస్కెట్ బాల్ ఆడేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు రియాన్ సింగ్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న విలువైన వస్తువులను లాగేసుకున్నారు.

ఆ తర్వాత రియాన్‌తో పాటు ఉన్న మరో ఇద్దరిపై ఆ యువకులు కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో రియాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అతని ఇద్దరు స్నేహితులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై రియాన్ పేరెంట్స్ విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ 20 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై రియాన్ తల్లి సుష్మా మానందర్ (Sushma Manandhar) ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి పుట్టినరోజు వేడుకలకు అంతా సిద్ధం చేసుకున్న సమయంలో ఇలాంటి వార్త విని గుండె ఆగినంత పనైందని ఆమె వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పుకొచ్చారు.

NRI: పాపం.. ఎన్నారై టెకీ.. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన యువతి.. నిలువునా ముంచేసిన వైనం..!


Updated Date - 2023-08-01T12:42:32+05:30 IST