e-visa: భారతీయ పర్యాటకులకు రష్యా పండగలాంటి వార్త.. ఇకపై ఆ దేశ పర్యటన చాలా ఈజీ !

ABN , First Publish Date - 2023-07-30T11:15:18+05:30 IST

భారతీయ పర్యాటకులకు రష్యా పండగలాంటి వార్త చెప్పింది. 2020లో మహమ్మారి కరోనా కారణంగా నిషేధించిన ఎలక్ట్రానిక్ వీసా (Electronic Visa) ను రష్యా (Russia) తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి భారత పాస్‌పోర్టు హోల్డర్లు ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

e-visa: భారతీయ పర్యాటకులకు రష్యా పండగలాంటి వార్త.. ఇకపై ఆ దేశ పర్యటన చాలా ఈజీ !

e-visa: భారతీయ పర్యాటకులకు రష్యా పండగలాంటి వార్త చెప్పింది. 2020లో మహమ్మారి కరోనా కారణంగా నిషేధించిన ఎలక్ట్రానిక్ వీసా (Electronic Visa) ను రష్యా (Russia) తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి భారత పాస్‌పోర్టు హోల్డర్లు ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల పర్యాటకులకు కూడా రష్యా.. ఇ-వీసా వెసులుబాటు కలిపించింది. ఇక ఇ-వీసా అనేది సాధారణ వీసాలానే పని చేస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అందువల్ల దరఖాస్తు చేసుకోవడం మరింత సులభం.

ఇ-వీసా ద్వారా రష్యాలో 16 రోజుల వరకు బస చేయడానికి వీలు ఉంటుంది. వీసా పొందిన తేదీ నుంచి 60 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. వీసా ఫీజు వచ్చేసి 40 డాలర్లు (రూ.32,903) ఉంటుంది. కాగా, ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ సంస్థల కోసం పనిచేసే వ్యక్తులకు ఈ వీసా అవసరం ఉండదు. ఇ-వీసాతో రాయబార కార్యాలయం వద్ద భారీ క్యూ లైన్లలో నిలబడవలసిన అవసరం లేదు. ఈ వీసా పర్యాటకులు రష్యాను సందర్శించడం చాలా సులభమవుతుంది.

Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల వరకు..!

Russiaa.jpg

ఇక రష్యాకు వెళ్లాలనుకునే విదేశీ సందర్శకులందరూ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఇ-వీసా (E-visa) కోసం దరఖాస్తు చేసుకోవాలి. కాగా, ఇ-వీసాలను పొందడానికి భారత పౌరులు చెల్లుబాటయ్యే ఇండియన్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండడం తప్పనిసరి. మొదట ఇ-వీసాల కోసం రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ వెబ్‌సైట్‌లో ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ప్లాన్ చేసుకున్న మీ టూర్‌ (Tour) కు కనీసం 72 గంటల (3రోజులు) ముందు ఆన్‌లైన్ ద్వారా మీ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

UK Visa: భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ గుడ్‌న్యూస్

అలా మీరు దరఖాస్తు చేసిన తర్వాత ఒక ఇ-మెయిల్ వస్తుంది. అందులో 'అప్రూవల్ గ్రాంటెడ్' అని ఉంటే మీరు రష్యాకు వెళ్లొచ్చు. 'ట్రావెల్ నాట్ అథారైజ్డ్‌' అని ఉంటే మాత్రం రష్యన్ ఎంబసీ (Russian Embassy) లో వేరే రకమైన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అదే 'అథరైజేషన్ ఇన్ పెండింగ్‌' అని ఉంటే దరఖాస్తు ఇప్పటికీ రివ్యూలో ఉందని, మీరు 72 గంటలలోపు తుది ప్రతిస్పందనను పొందుతారని మీనింగ్. అంతేగాక ఇ-మెయిల్ ద్వారా 'దరఖాస్తు స్టేటస్' తనిఖీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

NRI: అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మరో భారతీయ అమెరికన్.. ఎవరీ హర్ష్‌వర్ధన్ సింగ్..?

Updated Date - 2023-07-30T11:23:45+05:30 IST