Saud Arabia: సౌదీలో అసలేం జరుగుతుంది.. వారంలోనే 12వేల మంది వరకు ప్రవాసుల అరెస్ట్..!
ABN , First Publish Date - 2023-07-18T09:26:14+05:30 IST
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 12వేల మంది వరకు ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 12వేల మంది వరకు ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు. రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలు ఇలా పలు ఉల్లంఘనలకు పాల్పడిన సుమారు 11,915 మంది ప్రవాసులను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే (6 నుంచి 12 తేదీల మధ్యలో) ఇంత భారీ మొత్తంలో అరెస్టులు జరగడం గమనార్హం. ఇక అరెస్టైన వారిలో 6,359 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Residency Laws) ఉన్నారు. మరో 3,753 మంది అక్రమంగా దేశ సరిహద్దు (Illegal Border Crossing) దాటారు. అలాగే 1,803 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించగా (Violations of Labor Laws).. 675 మంది పక్క దేశాల నుంచి ప్రవేశించినవారు ఉన్నారు.
ఇక అదుపులో తీసుకున్నవారిలో 54శాతం మంది యెమెన్ దేశస్తులు (Yemenis) ఉండగా, 44 శాతం మంది ఇథియోపియన్, 2 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. రవాణా, ఆశ్రయం కల్పించడంతో సహా ఎవరైనా కింగ్డమ్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం చేసినట్లు తేలితే.. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ సౌదీ రియాళ్లు(రూ. 2.13కోట్లు) వరకు జరిమానా ఉంటుందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Interior) హెచ్చరించింది. అలాగే వాహనాలను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపింది.