Saudi Arabia: ఆ వీసాదారులకు సౌదీ అరేబియా తీపి కబురు.. అలా చేస్తే సౌదీలో ఎంట్రీ చాలా ఈజీ..!
ABN , First Publish Date - 2023-06-14T08:30:31+05:30 IST
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది. అందులోనూ బ్రిటన్, అమెరికాతో పాటు షెంజెన్ వీసా (Schengen Visa) హోల్డర్లు, యూరోపియన్ యూనియన్ దేశాల పర్మినెంట్ రెసిడెంట్స్ సులువుగా తమ దేశంలోకి ఎంట్రీ పొందవచ్చని తెలిపింది. దీనికోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ద్వారా తక్షణ ఇ-వీసా (e-Visa) కోసం దరఖాస్తు చేసుకోవాలని సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Tourism) వెల్లడించింది. యూకే, యూఎస్ లేదా షెంజెన్ దేశాలలో ఒకదాని నుంచి చెల్లుబాటయ్యే విజిట్ వీసా గానీ, బిజినెస్ వీసా గానీ ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. ఇలా మినహాయింపు ఉన్న వీసాదారులు ఫస్ట్-డిగ్రీ బంధువులతో పాటు యూఎస్, ఈయూ, యూకేలో శాశ్వత నివాసం (Permanent Residency) ఉన్న వారికి అదే ప్రవేశ హక్కులను మంజూరు చేసే వెసులుబాటు కల్పించింది.
కాగా, శాశ్వత వీసాదారులు ఏదైనా ఎయిర్, ల్యాండ్, ఓడరేవుల వద్ద ఆన్-అరైవల్ వీసా (On-Arrival Visa) ద్వారా కింగ్‌డమ్‌లోకి ఫస్ట్-డిగ్రీ రిలేటివ్స్‌కు యాక్సెస్ కల్పించవచ్చు. అయితే, ధృవీకరణ పత్రాలు ఎల్లప్పుడు వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఇక టూరిజం వీసాలు తమ హోల్లర్లకు తీర్థయాత్ర సమయంలో హజ్ (Hajj) లేదా ఉమ్రా (Umra) చేసే హక్కును కల్పించవని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. టూరిజం వీసా నియంత్రణ లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన జాతీయుల జాబితాకు యాక్సెస్ గురించి మరింత సమాచారం కోరుకునే వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపింది.