Saudi Arabia: భారత్ సహా ఏడు దేశాల పాస్‌పోర్టుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం..!

ABN , First Publish Date - 2023-05-05T12:52:54+05:30 IST

సౌదీ అరేబియా (Saudi Arabia) పాస్‌పోర్టుల స్టాపింగ్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Saudi Arabia: భారత్ సహా ఏడు దేశాల పాస్‌పోర్టుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం..!

రియాద్: సౌదీ అరేబియా (Saudi Arabia) పాస్‌పోర్టుల స్టాపింగ్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా ఏడు దేశాలలో తమ మిషన్‌ల కోసం ప్రస్తుతం వీసా స్టిక్కర్లను (Visa Stickers) ఇ-వీసాలతో భర్తీ చేసినట్లు వెల్లడించింది. సాధారణంగా ఓ వ్యక్తి పాస్‌పోర్టులో పెట్టే స్టిక్కర్‌కు బదులుగా పూర్తి డేటా కోసం క్యూఆర్ కోడ్‌లు ఉంటాయని సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (Saudi Ministry of Foreign Affairs) ప్రకటించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోని సౌదీ మిషన్లలో మే 1వ తేదీ నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కాన్సులర్ సర్వీసులను ఆటోమేట్ చేయడానికి వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలతో సహా వివిధ రకాల వీసాల మంజూరు కోసం ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగిందని పేర్కొంది.

Big Ticket draw: ఇద్దరు భారతీయులకు కలలో కూడా ఊహించనంత డబ్బు.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడ్డాయి..!


Updated Date - 2023-05-05T13:18:52+05:30 IST